ఆ విషయంలో మీరు ఫేయిల్ .. మోదీకి కమల్ ఘాటు లేఖ

ఆ విషయంలో మీరు ఫేయిల్ .. మోదీకి కమల్ ఘాటు లేఖ
x
kamal haasan, PM Modi
Highlights

కరోనావైరస్ వ్యాప్తి కట్ట‌డికి ప్రధాని న‌రేంద్ర‌మోదీ పిలుపు నిచ్చిన‌ 21 రోజుల లాక్‌డౌన్‌ను విమర్శిస్తూ సినీనటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఓ బహిరంగ లేఖ రాశారు

కరోనావైరస్ వ్యాప్తి కట్ట‌డికి ప్రధాని న‌రేంద్ర‌మోదీ పిలుపు నిచ్చిన‌ 21 రోజుల లాక్‌డౌన్‌ను విమర్శిస్తూ సినీనటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ఆ లేఖలో ప‌లు అంశాల‌ను ప్రస్తావించారు. ఈ లాక్ డౌన్ బ‌డుగులు, పేద‌వారిని డిమానిటైజేషన్ కంటే తీవ్రంగా బాధిస్తుందని పేర్కొన్నారు.

చైనాలో తొలి క‌రోనా కేసు డెబ్లుహెచ్ వో అధికారిక ప్రకటన ప్రకారం డిసెంబర్ 8 వ‌తేదీనా ధృవీకరించబడింది. మన దేశంలో కరోనా కేసు జనవరి 30వ తేదీన న‌మోదఅయ్యింది. మీరు 1.4 బిలియన్ల మొత్తం దేశాన్ని 4 గంటల్లో మూసివేయమని ఆదేశించారు. మరీ 4 నెలల నుంచి ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు.

దేశానిక మీరేదో చెప్తారని అంద‌రూ దీపాలను ముట్టించాలనీ. లైట్స్ వెలిగించాలీ, ప్రజల్నీ కోరుతున్నారు. పొట్టకూడుకోసం ఇతర ప్రాంతాల్లో ప‌నిచేస్తూ చిక్కుకుపోయారు. కనీసం వారికి తిండికి ఏమీ లేదు. మీరు దీపాలను వెలిగించాలనీ కోరుతున్నారు. జిడిపిలో గానీ దేశ నిర్మాణంలో గానీ వారు సహకారాన్ని విస్మరించలేము.

మీ నిర్ణయాలు ఎక్కువుగా మ‌ద్య‌త‌ర‌గ‌తి వారిని సంతోష పెట్టె విధంగానే ఉన్నాయి. కానీ ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పేదవారి సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి అని లేఖ‌లో ప్రస్తావించారు. దేశంలో అత్య‌థికులు పేద‌లే ఉన్నార‌ని అన్నారు.

దేశంలో విజనరీ లీడర్ అంటే సమస్యలు పెద్దవి కావడానికి ముందే వాటికి పరిష్కారాల కోసం ప్రయత్నిస్తారు. ఆ విషయంలో మీరు విఫ‌ల‌మైయ్యారిని పేర్కోంటూ లేఖ‌లో ప్ర‌స్తావించారు. అయితే నిర్ణ‌యాలు తీసుకునే ముందు అందరిని కలుపుకొని పోవాలనీ, అందుకు మేముకు కూడా తోడుగా ఉంటామని కమల్ హాసన్ పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories