కోట్లు విలువ చేసే కారు ని లోకేష్ కనగరాజ్ కి అందించిన కమల్ హాసన్

Kamal Haasan gives Castley car as a Gift to Lokesh Kanagaraj
x

కోట్లు విలువ చేసే కారు ని లోకేష్ కనగరాజ్ కి అందించిన కమల్ హాసన్

Highlights

కోట్లు విలువ చేసే కారు ని లోకేష్ కనగరాజ్ కి అందించిన కమల్ హాసన్

Kamal Haasan: దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టిన కమల్ హాసన్ "విక్రమ్" సినిమాతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. "ఖైదీ" ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మలయాళం స్టార్ ఫాహాధ్ ఫాసిల్ మరియు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య జూన్ 3న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది.

రాజ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాని చిత్ర డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చాలా పవర్ ఫుల్ గా తెరకెక్కించారు. పైగా లోకేష్ కమల్ పాత్రను తీర్చిదిద్దిన విధానం అభిమానులకు కన్నుల విందు చేసింది. కమల్ హాసన్ నట విశ్వరూపాన్ని చూసి అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు.

ఇప్పటికే అన్ని భాషల తో కలిపి ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు కలెక్షన్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా కమల్హాసన్ లోకేష్ కనకరాజు ఒక కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అక్షరాల 2.5 కోట్లు ఖరీదు చేసే లెక్సియన్ కారుని కారు తో పాటు ఒక ఎమోషనల్ లెటర్ ని కూడా లోకేష్ కనగరాజ్ కు అందించారు కమల్ హాసన్. సోషల్ మీడియా వేదికగా లోకేష్ కనగరాజ్ ఈ విషయాన్ని పంచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories