Top
logo

Entha Manchivaadavuraa: ఎంత మంచివాడవురా! సినిమా రివ్యూ

Entha Manchivaadavuraa: ఎంత మంచివాడవురా!  సినిమా రివ్యూ
X
Highlights

సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని చిత్రాలు సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని చిత్రాలు సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఒక సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ దర్బార్, మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్ని అల వైకుంఠపురంలో.. ప్రేక్షకులను మెప్పించాయి. మూడు వైవిద్యభరితమైన చిత్రాలు కావడంతో సినీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. నందమూరి కళ్యాణ్‌రామ్‌ , మెహరీన్‌ జంటగా నటించిన ఈ సినిమాకు 'శతమానం భవతి' సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నదర్శకుడు సతీష్‌ వేగేశ్న డైరెక్సన్ చేశారు. MLA, నా నువ్వే, 118 లాంటి వరుస పరాజయాల తర్వాత ఎంతమంచివాడవురా!తో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.‎ సతీష్ వేగేశ్నశ్రీనివాస కళ్యాణం పరాజయం తర్వాత దర్శకుడికి, కళ్యాణ్‌ రామ్‌కు.ఎంతో ప్రెస్టేజ్‌గా మారింది. ఈ నేపథ్యంలో నందమూరి హిరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంతమంచివాడవురా సినిమాకు కూడా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా.. బుధవారం విడుదలైన ఎంత మంచివాడవురా! ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ

ఈ సినిమాలో హీరో బాలు(కళ్యాణ్‌ రామ్‌)కు రిలేషన్స్, బంధుత్వాలంటే చాలా ఇష్టం. చిన్నతనంలో పుట్టినరోజు సంరద్భంగా చుట్టాలందిరినీ పిలిచి పండగలా చేసుకోవాలని‎ బాలు తన తండ్రిని కోరుతాడు. చుట్టాలంటే తనకు ఇష్టమని అందుకే అలా పుట్టినరోజు చేసుకోవాలని బాలుని కోరతాడు. ఈక్రమంలో సంతోషంగా సాగుతున్న బాలు జీవితంలో ఓ ఉపద్రవం వచ్చి పడుతుంది. బాలు తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోతారు. ఈ సమయంలో బంధువులు అంతా బాలు చేతిలో డబ్బులు పెడతారే తప్ప చేయందించి చేరదీయరు. ఇదే సమయంలో హీరోయిన్ నందిని (మెహరీన్‌)కి బాలుతో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు కలిసి పెద్దైయ్యాక షార్ట్ ఫిల్స్ తీస్తుంటారు.

ఈ నేపధ్యంలో స్నేహితుల దగ్గర బాలు ఓ విషయాన్ని దాచిపెడతాడు. ఈ విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్‌కు కూడా తెలియడంతో వారంతా బాలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే బాలు అసలు విషయం చెప్పి వారి దగ్గర ఓ ప్రపోజల్‌ ఉంచుతాడు. దీంతో అసలు కథ, ఎమోషన్స్‌ మొదలవుతాయి. ఫేండ్ర్స్ దగ్గర బాలు పెట్టిన ప్రపోజల్‌ ఏంటి? ఈ కథలోకి మిగత క్యారెక్టర్లు ఎలా వస్తాయి? ‎ట్రైలర్ లో, టీజర్ లో చూపింన శివ, ఆచార్య, రిషి, సూర్య, బాలు అందరూ ఒక్కరేనా? అనేదే అసలు సినిమా కథ


విశ్లేషణ:

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తన పంథా మార్చుకుని ఫ్యామిలీ ఎంటర్రైనర్ లో చేశాడు. కెరీర్‌ ప్రారంభంలో మాస్ కమర్షియల్ చిత్రాలు చేసిన ఈ నందమూరి హీరో ఈ సినిమాలో కుటుంబ కథానాయకుడిగా చక్కగా నటించాడు. మరోసారి అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కామెడీతో పాటు ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ పండించడంలో విజయం సాధించాడు. హీరోయిన్‌ మెహరీన్‌ సినిమా అద్యంతం కళ్యాణ్‌ రామ్‌తోనే ఉంటుంది. హీరోపై తనకుండే ప్రేమను ఇలా అన్ని రకాల సిన్స్లో ఒదిగిపోయింది. హీరో కోసం పరితపించే అమ్మాయిగా కలిపిస్తుంది. ఈ చిత్రంతో నటిగా మెహరీన్ నటన అద్భతమనే చెప్పాలి. ఇక విలన్‌గా కనిపించిన రాజీవ్‌ కనకాల తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సుహాసిని, శరత్‌ బాబు, తనికెళ్ల భరిణి, నరేశ్‌ వారి పాత్రలను న్యాయం చేశారు. వెన్నెల కిశోర్‌, సుదర్శన్‌, ప్రవీణ్‌లు మంచి కామెడీతో ఆకట్టుకున్నారు.

ఆధునిక నాగరికతకు అలవరుకుంటున్న ప్రస్తుతకాలంలో యువత బంధాలు, బంధుత్వాలకు కనెక్ట్‌ కాలేకపోతున్నారు. ‎ఉరుకులు పరుగుల జీవితంలో‎ కాస్త విరామం దొరికితే విశ్రాంతి తీసుకోవడానికే ప్రయత్నిస్తున్నారే బంధాలను కలుపుకోవడానికి ప్రయత్నించడం లేదు. కొన్ని పాయిట్లతో కథను రాసుకుని నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్‌ అభినందనులు చెప్పాలి. నందమూరి అభిమానులు తమ హీరో నుంచి మాస్‌ ఎలిమెంట్స్‌నే కోరుకుంటారు. కుటుంబకథా చిత్రాన్ని ఓప్పుకోలేరు. కథ నచ్చడంతో , కొత్త పంథాలో తీయాలనే ఉద్ధేశ్యంతో కళ్యాణ్ రామ్ ట్రై చేయడం ఆయన సహసానికి నిదర్శనం.

శతమానం భవతి, శ్రీనివాస్‌ కళ్యాణం వంటి చిత్రలతో మంచి కుటుంబకథాలు తెరకెక్కించడంతో మంచి ముద్రపడిపోయారు సతీష్‌ వేగేశ్న. ఈ సినిమాలో నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో అక్కడక్కడ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించారు. ఈ చిత్రంలో కథ సగంకు పైగా ఫ్లాష్‌ బ్యాక్‌లోనే నడుస్తుంది. కొత్త కాన్సెప్ట్ అందరిని ఆలోచింపజేస్తుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు సతీష్ వేగేశ్న కన్ఫ్యూజ్ కావడం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ చిత్రంలో ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ప్రజెంట్ చేయలేకపోయారు. కొన్ని సీన్స్ ప్రేక్షకులకు తలనొప్పి కట్టిస్తాయి.

‎ఇక సాంకేతికత పరంగా చూస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. మున్నార్‌, కళ్యాణ్ రామ్, మెహరీన్ ను చాలా అందంగా చూపించారు. అయితే పాటు బాగున్నపటికి గోపీ సుందర్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ స్కోరు కొత్తగా ఉండదు. బాలసుబ్రమణ్యం పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాక్షన్‌ సీన్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ విషయంలో కాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీపడలేదు.‎

ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే ఎమోషన్స్‌, ఫీల్ గూడ్ సినిమా అవ్వడం ఖాయం.

Web TitleKalyan Ram Entha Manchivaadavuraa movie review
Next Story