Kalki 2 Shocking Twist: ప్రభాస్ సరసన ఎవరూ ఊహించని హీరోయిన్.. ఇక బాక్సాఫీస్ బద్దలే

Kalki 2 Shocking Twist
x

Kalki 2 Shocking Twist: ప్రభాస్ సరసన ఎవరూ ఊహించని హీరోయిన్.. ఇక బాక్సాఫీస్ బద్దలే

Highlights

Kalki 2 Shocking Twist: దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసారి ఊహించని మలుపులతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. అందులో భాగంగానే ఒక కీలక పాత్ర మార్పు గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.

Kalki 2 Shocking Twist: బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన 'కల్కి 2898 AD' సీక్వెల్ గురించి ఒక షాకింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసారి ఊహించని మలుపులతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. అందులో భాగంగానే ఒక కీలక పాత్ర మార్పు గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.

మొదటి భాగంలో సుమతిగా, కల్కికి జన్మనిచ్చే తల్లి పాత్రలో దీపికా పదుకొణె అద్భుతంగా నటించింది. అయితే, సీక్వెల్‌లో కథా పరంగా ఒక పెద్ద మలుపు ఉండబోతోందని సమాచారం. సుమతి పాత్ర సెకండ్ పార్ట్ ప్రారంభంలోనే ముగిసిపోతుందని, ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుందని టాక్. ఈ క్రమంలోనే కథను మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను నాగ్ అశ్విన్ డిజైన్ చేశారట. ఆ పవర్‌ఫుల్ పాత్ర కోసం మరెవరినో కాదు.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని మేకర్స్ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

సాయి పల్లవి స్క్రీన్ మీద ఉంటే ఆ ఎమోషనే వేరు. ఆమె సహజ సిద్ధమైన నటన, కళ్ళతోనే పలికించే హావభావాలు 'కల్కి 2' వంటి భారీ మైథాలజీ-సైన్స్ ఫిక్షన్ సినిమాకు వెన్నెముకగా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్, సాయి పల్లవి కలిసి నటించలేదు. ఒకవైపు పాన్ ఇండియా స్టార్, మరోవైపు పెర్ఫార్మెన్స్ క్వీన్.. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.

సుమతి పాత్ర ముగిసిన తర్వాత, కల్కిని కాపాడే ఒక యోధురాలిగానో లేదా ఒక దైవిక శక్తి ఉన్న పాత్రలోనో సాయి పల్లవి కనిపిస్తుందని సోషల్ మీడియాలో థియరీలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ గ్రేస్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సాయి పల్లవి ఎంపిక నిజమైతే.. కల్కి 2 కేవలం ఒక సినిమా కాదు, అదొక ఎమోషనల్ విజువల్ వండర్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు, సాయి పల్లవి క్లాస్ నటన తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే. నాగ్ అశ్విన్ ఈసారి ఏ రేంజ్ మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories