Kalamkaval OTT Release: ఏం మలయాళ థ్రిల్లర్‌రా బాబూ.. ‘కాలంకావల్’ ట్విస్ట్‌లకు ట్విస్ట్‌లు.. తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్

Kalamkaval OTT Release: ఏం మలయాళ థ్రిల్లర్‌రా బాబూ.. ‘కాలంకావల్’ ట్విస్ట్‌లకు ట్విస్ట్‌లు.. తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్
x

Kalamkaval OTT Release: ఏం మలయాళ థ్రిల్లర్‌రా బాబూ.. ‘కాలంకావల్’ ట్విస్ట్‌లకు ట్విస్ట్‌లు.. తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్

Highlights

Kalamkaval OTT Release: మమ్ముట్టి నెగటివ్ రోల్‌లో నటించిన మలయాళ థ్రిల్లర్ మూవీ ‘కాలంకావల్’. 2 గంటల 17 నిమిషాల పాటు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. జనవరి 16 నుంచి సోనీ లైవ్‌లో తెలుగుతో సహా పలు భాషల్లో స్ట్రీమింగ్.

Kalamkaval OTT Release: థ్రిల్లర్ సినిమాలంటే ఆడియెన్స్‌లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వచ్చిందంటే భాష అడ్డంకి కాదు.. సబ్‌టైటిల్స్ పెట్టుకుని మరీ చూసేస్తారు. అలాంటి ప్రేక్షకుల్ని పూర్తిగా హుక్ చేసే ఓ పవర్‌ఫుల్ మలయాళ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి రాబోతోంది.

ఆ సినిమా పేరు ‘కాలంకావల్’ (Kalamkaval). మమ్ముట్టి నెగటివ్ షేడ్స్‌లో కనిపించిన ఈ మూవీ, 2 గంటల 17 నిమిషాల పాటు ఆడియెన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్‌తో కథ నడుస్తూ.. “ఇంకా ఏం జరుగుతుంది?” అనే ఉత్కంఠను చివరి వరకూ నిలబెడుతుంది.

జితిన్ కె. జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. డిసెంబర్ 5న రిలీజైన ‘కాలంకావల్’ మలయాళంలో ఏకంగా రూ.85.2 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 16 నుంచి సోనీ లైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ కథలో.. ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్‌కి, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్‌కి మధ్య జరిగే ‘క్యాట్ అండ్ మౌస్’ గేమ్ ప్రధానాంశం. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, స్లో-బర్న్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్‌తో పాటు కథనంతో ఆకట్టుకుంటుంది.

మమ్ముట్టి ఈ సినిమాలో హీరో కాదు.. ఓ సైకో కిల్లర్. ఆయన నెగటివ్ రోల్‌లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇది ఆయన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్‌గా చెప్పొచ్చు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో వినాయకన్ నటన కూడా మమ్ముట్టికి ఏమాత్రం తీసిపోదు. రజీషా విజయన్, శృతి రామచంద్రన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముజీబ్ మజీద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంటెన్సిటీని మరింత పెంచింది. IMDbలో 7.5 రేటింగ్ పొందిన ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్ మిస్ అవ్వకూడని కంటెంట్.

Show Full Article
Print Article
Next Story
More Stories