Kajol: చిన్నప్పుడు స్కూల్‌ నుంచి పారిపోయా... కానీ మధ్యలోనే..

Kajol Childhood Memory Grandmother Hostel Escape Story
x

Kajol: చిన్నప్పుడు స్కూల్‌ నుంచి పారిపోయా... కానీ మధ్యలోనే..

Highlights

Kajol: అందం..అభినయంతో ఒక తరాన్ని ఊపిన తార.. కాజోల్. అజయ్ దేవగన్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నా.. అంతే గ్లామరస్‌గా ఉంది.

Kajol: అందం..అభినయంతో ఒక తరాన్ని ఊపిన తార.. కాజోల్. అజయ్ దేవగన్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నా.. అంతే గ్లామరస్‌గా ఉంది. మధ్య మధ్యలో చాలా సినిమాలు చేస్తూనే ఉంది. ఇటీవల వచ్చిన హర్రర్ అండ్ టెర్రర్ సినిమా మా.. వోటీలో తెగ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఒక ఇంటర్యూల్లో తన అమ్మమ్మ గురించి చెప్పి.. ఎన్నో చిన్నప్పటి విషయాలను గుర్తుచేసుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ అందాల భామ కాజోల్‌కు తన ఆమ్మమ్మ అంటే చాలా ఇష్టమట. చిన్నప్పుడు అమ్మకంటే అమ్మమ్మనే ఎక్కువగా ఇష్టపడేదాన్నని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజోల్ చెప్పింది. అమ్మమ్మ కోసం ఓ సారి స్కూల్ నుంచి పారిపోయానని.. అయితే మధ్యలోనే అంతా జరిగిపోయిందంటూ చెప్పుకొచ్చింది.

నా వయసు అప్పుడు 11ఏళ్లు. మా అమ్మానాన్నలు ముంబైలోనే ఉండేవారు. కానీ నన్ను ముంబైకి ఐదు గంటల దూరంలో ఉన్న పంచంగిలోని హాస్టల్‌లో ఉంచి చదివించేవారు. ఒకరోజు అమ్మ నాకుఫోన్ చేసి... అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదని చెప్పింది. అయితే దానికి నేను ఇంటికి వస్తాను అని చెప్పడంతో.. వద్దు.. పరీక్షలు రాసిన తర్వాత వద్దువుగానీ అని అమ్మ చెప్పింది. కానీ నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మకంటే ఎక్కువ ఇష్టం. అలాంటిది హాస్ట్లల్‌ నుంచి వెళ్లి అమ్మమ్మను ఎలా చూడాల్లో అర్ధం కాలేదు.

అదే సమయానికి నా స్నేహితురాలు కూడా మూడీగా ఉంది. తను కూడా ఇంటికి వెళ్దాం అంది. ఇంకేముంది ఇద్దరం ప్లాన్ చేసుకుని హాస్టల్‌నుంచి ఎలాగోలా బయటపడ్డాం. అయితే అదే టౌన్‌లో ఉన్న మా చుట్టాల ఇంటికి వెళ్లాం. అప్పుడు నేను వాళ్లతో ఒక అబద్దం చెప్పాను. అదేంటంటే.. అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది.. నన్ను ముంబైకి రమ్మని..అన్నట్టు చెప్పాను. అప్పుడు మా బంధువులు నన్ను, నా స్నేహితులరాలిని తీసుకుని బస్సు ఎక్కించేందుకు బస్‌ స్టాఫ్ కి తీసుకెళ్లారు. కానీ అప్పుడు ఏంజరిగిందంటే.. మా స్కూల్ హాస్టల్ వార్డెన్, మరొకరు వచ్చి మా చెవులను మెలేసి మళ్లీ వెనక్కి తీసుకెళ్లిపోయారు.. అంటూ కాజోల్ తన చిన్న నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories