Kajal Aggarwal: మళ్ళీ అలాంటి పాత్రలే కావాలి అంటున్న కాజల్

* ఇన్నాళ్లు సినిమాలకి ఇంత దూరంగా ఉన్న కాజల్ కి ఇప్పుడు మళ్లీ కమర్షియల్ పాత్రలు వస్తాయా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది.

R Tripura Malini
Updated on: 15 Nov 2022 9:00 PM IST
kajal says that she does not want such roles
X

మళ్ళీ అలాంటి పాత్రలే కావాలి అంటున్న స్టార్ హీరోయిన్

Kajal Aggarwal: ఇండస్ట్రీ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ ని రూల్ చేస్తున్న కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని సినిమాల స్పీడ్ తగ్గించింది. తల్లి అయ్యి ఒక పండంటి బిడ్డ కి జన్మనిచ్చిన కాజల్ కొన్ని నెలలు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు మళ్లీ కాజల్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కాజల్ కి పలువురు ప్రముఖ దర్శకనిర్మాతల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆసక్తికరంగా కాజల్ కి వస్తున్న పాత్రలన్నీ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలే అని అంటున్నారు.

అయితే కాజల్ అలాంటి పాత్రలు చేయడానికి మాత్రం ఆసక్తి చూపించడం లేదట. నిజానికి కాజల్ చాలా వరకు కమర్షియల్ సినిమాలలో గ్లామరస్ పాత్రలలో నటించే స్టార్ స్టేటస్ ను అందుకుంది. కాజల్ ఇంతకు ముందు లాగానే మళ్లీ గ్లామరస్ పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది అని సమాచారం. ఈ మధ్యనే ఒక స్టార్ దర్శకుడు ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా స్క్రిప్ట్ తో కాజల్‌ను సంప్రదించగా కాజల్ మాత్రం సున్నితంగా తిరస్కరిస్తూ గ్లామ్ పాత్ర కోసం చూస్తున్నట్లు పేర్కొంటూ ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించింది.

కాబట్టి ఇప్పుడు మళ్లీ కాజల్ స్టార్ హీరోల తోనే కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మహిళా సెంట్రిక్ పాత్రల తో కాజల్ ను సంప్రదించాలని అనుకుంటున్న డైరెక్టర్లు ఇప్పుడు వెనక్కి వెళ్లిపోతున్నారట. మరి ఇన్నాళ్లు సినిమాలకి ఇంత దూరంగా ఉన్న కాజల్ కి ఇప్పుడు మళ్లీ కమర్షియల్ పాత్రలు వస్తాయా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story