"పుష్ప: పార్ట్ 2" లో ఐటెం సాంగ్ లో కనిపించనున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Pushpa 2: పుష్ప కోసం రంగం లోకి దిగనున్న కాజల్ అగర్వాల్

Jyothi
Published on: 30 Sept 2022 8:38 AM IST
Kajal Aggarwal Will Enter the Field for Pushpa 2 Movie
X

"పుష్ప: పార్ట్ 2" లో ఐటెం సాంగ్ లో కనిపించనున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన "పుష్ప పార్ట్: 1" లో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అనే ఐటమ్ సాంగ్ లో కనిపించి టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్ తో సమానంగా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ తన అందాలను సైతం ఆరబోస్తూ పాటను చార్ట్ బస్టర్ గా మారేలా చేసింది సమంత. అయితే "పుష్ప: పార్ట్ 2" లో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. మరి ఇందులో ఏ హీరోయిన్ కనిపించనుంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ "పుష్ప పార్ట్ 2" లో ఐటమ్ సాంగ్ లో బన్నీతో కలిసి డాన్స్ చేయనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో "జనతా గ్యారేజ్" సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లో చిందులేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు అల్లు అర్జున్ సరసన డాన్స్ చేయబోతోందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈ మధ్యనే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ మళ్లీ హీరోయిన్గా తన కరిగిన రీస్టార్ట్ చేయాలని అనుకుంటుంది. ఈ సమయంలో "పుష్ప" లో ఐటెం సాంగ్ లో కనిపించడం ఈమెకు బాగానే ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ప్యాన్ ఇండియన్ సినిమా కావడం వల్ల ఈమెకు మరింత రీచ్ కూడా లభిస్తుంది.

Jyothi

Jyothi

Next Story