NBK108: బాలకృష్ణ కోసం షూటింగ్ మొదలుపెట్టబోతున్న కాజల్

Kajal Aggarwal Entry In Balayya Shooting Sets
x

Kajal Aggarwal: బాలకృష్ణ కోసం షూటింగ్ మొదలుపెట్టబోతున్న కాజల్ 

Highlights

Kajal Aggarwal: బాలయ్య షూటింగ్ సెట్స్ లో కాజల్ అగర్వాల్ ఎంట్రీ..

Kajal Aggarwal: దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కాజల్ అగర్వాల్ తన కెరియర్లో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకుంది. పెళ్లి తర్వాత కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే ఒక బిడ్డకి జన్మనిచ్చి తల్లి అయింది. తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ కొన్నాళ్ళు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది.

తాజాగా ఇప్పుడు కాజల్ అగర్వాల్ మళ్లీ వరుస సినిమా షూటింగులతో బిజీ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సినిమా షూటింగ్స్ ను పూర్తి చేసుకుంటున్న కాజల్ అగర్వాల్ మరోవైపు వేరే కథలను కూడా వింటున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న "భారతీయుడు 2" సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ సీనియర్ హీరో బాలకృష్ణ సరసన కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో బాలకృష్ణ భార్య పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతోంది. వీరిద్దరి కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమా షూటింగ్ కోసం డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 4వ తేదీ నుంచి కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సినిమా షూటింగ్లో పాల్గొనబోతోంది. షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories