బాలకృష్ణ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ బ్యూటీ

Kajal Aggarwal is Going to Romance With Balakrishna
x

బాలకృష్ణ తో రొమాన్స్ చేయబోతున్న కాజల్ అగర్వాల్

Highlights

Balakrishna: బాలకృష్ణ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ బ్యూటీ

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా విడుదలైన "వీర సింహా రెడ్డి" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇక తాజాగా ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. వరుస సూపర్ హిట్ సినిమాలతో కరియర్లో ముందుకు దూసుకుపోతున్న అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సినిమా గురించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది అని తెలుస్తోంది. ఒకవైపు "ధమాకా" బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతోంది. అంటే ఇప్పుడు శ్రీ లీల కాజల్ కూతురి పాత్రలో కనిపించనుంది అన్నమాట.

ఈ మధ్యనే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రి ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ సరసన "భారతీయుడు 2" సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు బాలకృష్ణ సరసన కూడా హీరోయిన్ గా నటించేందుకు సిద్ధమైంది దీని గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. అనిల్ రావిపూడి మిగతా సినిమాల లాగానే ఈ సినిమా కూడా ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ గా విడుదల కాబోతోంది అని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories