త్రిష అవుట్ .. కాజల్ ఇన్ ?

త్రిష అవుట్ .. కాజల్ ఇన్ ?
x
kajal agarwal replace the trisha role
Highlights

గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నాడు..

గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నాడు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ ఫిక్స్ చేసినప్పటికీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.. కానీ తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి త్రిష వైదొలిగినట్లు స్పష్టం చేశారు.

"కొన్ని విషయాలు మొదట చెప్పినట్లు, చర్చించుకున్నట్లు భిన్నంగా మారుతుంటాయి. క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి గారి చిత్రంలో నటించకూడదని అనుకున్నా. సినిమా యూనిట్‌కు నా అభినందనలు. తెలుగు ప్రేక్షకులను మరొక మంచి ప్రాజెక్టుతో కలుస్తానని ఆశిస్తున్నా' అని త్రిష పేర్కొంది. గతంలో చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు.. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా త్రిష వెల్లడించి అందరికి షాక్ ఇచ్చింది.

అయితే ఇప్పుడు త్రిష స్థానంలో హీరోయిన్‌గా కాజల్‌ని తీసుకోవాలని అనుకుంటుందట చిత్రబృందం..ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. త్వరలోనే కాజల్ కూడా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొననుందని తెలుస్తోంది. గతంలో చిరు, కాజల్ కాంబినేషన్ లో 'ఖైదీ 150' అనే సినిమా తెరకెక్కింది.

నక్సలైట్ లుక్ లో మెగాస్టార్ లుక్ లీక్ :

ప్రస్తుతం శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మెగాస్టార్ నక్సలైట్ గెటప్ లో ఉన్న ఓ లుక్ లీకైంది... ఈ ఫోటో సోషల్ మీడియాలో వీపరితంగా వైరల్ అయింది. అంతేకాకుండా ఫోటోతో పాటు ఓ వీడియో కూడా లీక్ అయింది. అయితే దీనిపైన వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ వెంటనే సదరు వీడియోను ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి తోలిగించింది కానీ ఫొటోల్ని మాత్రం తొలిగించడం వీళ్ల వల్ల కావడం లేదు. అప్పటికే ఫోటో సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపొయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories