logo
సినిమా

Kajal Agarwal New Movie: "ఉమా" కోసం కోల్‌కతా లో కాజల్ అగర్వాల్

Kajal Agarwal New Movie Uma shooting in Kolkata
X

కాజల్ అగర్వాల్ (ఫోటో: ది న్యూస్ మినిట్) 

Highlights

Kajal Agarwal: చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి కుర్రకారులో ఎంత ఫాలోయింగ్ కొత్తగా చెప్పనవసరం లేదు.

Kajal Agarwal New Movie: చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి కుర్రకారులో ఎంత ఫాలోయింగ్ కొత్తగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన ఈ భామ తన పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతుంది. తాజాగా కాజల్ ఫాంటసీ కథాంశంతో తెరకేక్కబోతున్న కొత్త చిత్రం "ఉమా" సినిమా షూటింగ్ పాల్గొనబోతుంది. దాదాపుగా 45 రోజుల పాటు జరగనున్న "ఉమా" సినిమా షూటింగ్ కోల్‌కతాలో సోమవారం ప్రారంభంకానుంది. ఈ చిత్ర యూనిట్ 45 రోజుల షూటింగ్ షెడ్యుల్ లో ఈ చిత్రాన్ని ముగించనున్నట్లు తెలుస్తుంది.

ఈ చిత్ర షూటింగ్ కోసం కాజోల్ 45 రోజులు కోల్‌కతాకి మకాం మార్చనుంది. తాతాగట సింఘ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంత్ర రాజ్ పలివాల్ మిరాజ్ గ్రూప్ బ్యానర్ పై అవిషేక్ ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి రెమ్యునరేషన్‌గా ఆమె రెండు కోట్ల రూపాయాలను తీసుకోనున్నట్లు సమాచారం. మరోపక్క తెలుగులో చిరంజీవికి జోడిగా "ఆచార్య" సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ .. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న "భారతీయుడు-2'' చిత్రంలో కూడా నటించబోతుంది.

Web TitleKajal Agarwal New Movie Uma Shooting in Kolkata | Kajal Agarwal New Movie
Next Story