Kaikala Satyanarayana: ఇవాళ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు

Kaikala Satyanarayana Last Rites Today
x

Kaikala Satyanarayana: ఇవాళ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు

Highlights

Kaikala Satyanarayana: ఉ.11 గంటలకు మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు

Kaikala Satyanarayana: తెలుగు సినీ నట దిగ్గజం, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతితో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో.. ప్రభుత్వ లాంఛనాలతో కైకాల దహన సంస్కారాలు జరగనున్నాయి.

నటుడిగా సినీ పరిశ్రమకు, ఎంపీగా ప్రజలకు సత్యనారాయణ చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అందుకోసం పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories