మహేష్, చరణ్ బాటలో ఎన్టీఆర్ ?

Jr NTR
x
Jr NTR
Highlights

సినిమా హీరోలు ఇప్పుడు నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. హీరోగా సినిమాలు చేసుకుంటూనే మరో పక్కా నిర్మాణ భాధ్యతలు చేపడుతూ రెండు చేతుల...

సినిమా హీరోలు ఇప్పుడు నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. హీరోగా సినిమాలు చేసుకుంటూనే మరో పక్కా నిర్మాణ భాధ్యతలు చేపడుతూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఇప్పటికే మహేష్ ఎంబీ క్రియేషన్స్ అని ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం అనే సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం సరిలేరు నికేవ్వరు అనే సినిమాకి వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నాడు మహేష్.. ఇక అదే బాటలో రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి చిరంజీవి హీరోగా ఖైది నెంబర్ 150, సైరా లాంటి చిత్రాలని నిర్మించాడు. ప్రస్తుతం చిరంజీవి 152 వ సినిమాని కూడా నిర్మిస్తున్నాడు.

అంతేకాకుండా విజయ్ దేవరకొండ, నాని, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఇదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఓ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి సినిమాలని నిర్మించే ప్లాన్ లో తారక్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR ( వర్కింగ్ టైటిల్) నటిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories