Jr NTR: ఎన్టీఆర్‌ వేసుకున్న ఈ షర్ట్‌ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే

Jr NTR: ఎన్టీఆర్‌ వేసుకున్న ఈ షర్ట్‌ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే
x
Highlights

Jr NTR: ట్రిపులార్‌, దేవరలాంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ప్రస్తుతం వార్‌ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Jr NTR: ట్రిపులార్‌, దేవరలాంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ప్రస్తుతం వార్‌ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తారక్‌ లేటెస్ట్‌ లుక్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తిగా స్లిమ్‌ లుక్‌లోకి మారిపోయారు ఎన్టీఆర్‌. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ ప్రత్యేకంగా బరువు తగ్గారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇటీవల ఎన్టీఆర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరలవుతున్నాయి. వీటిలో ఆయన క్యాజువల్ లుక్‌లో అదిరిపోయే స్టైల్‌తో మెరిసిపోతున్నారు. తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న తారక్, అక్కడ అభిమానులతో కలసి ముచ్చటిస్తూ కనిపించారు. ఆయన వేసుకున్న నీలిరంగు పూల చొక్కా మాత్రం నెటిజన్ల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ షర్ట్ ధర ఎంతో తెలుసుకునేందుకు తెగ వెతికారు.

అంతర్జాతీయ డిజైనర్‌ బ్రాండ్‌కి చెందిన ఈ షర్ట్‌ ధర ఏకంగా రూ. 85,000 అని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు ఔరా అంటున్నారు. ప్రస్తుతం ఈ షర్ట్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో వార్‌2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో వచ్చే వారం ఎన్టీఆర్ జాయిన్ కానున్నట్లు సమాచారం. అంతేకాదు, త్వరలోనే ఓ టాప్ తమిళ దర్శకుడితో కలిసి కొత్త సినిమా ప్రకటించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories