Jr NTR: మూడవ నిమిషం లో ఆడియన్స్ మారిపోతారు అంటున్న ఎన్టీఆర్

Jr NTR: చెర్రీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు కేవలం సినిమా ఫ్యాన్స్ అంటున్న తారక్

admin1
Updated on: 27 Dec 2021 6:45 PM IST
Jr NTR said that fans will only enjoy the RRR movie | Tollywood News
X

చెర్రీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు కేవలం సినిమా ఫ్యాన్స్ అంటున్న తారక్

Jr NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్యాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమా "ఆర్ఆర్ఆర్". ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్ర బృందం. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ మరియు హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

"సినిమా మొదలయ్యాక మొదటి రెండు నిమిషాలు మాత్రమే రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు సినిమా చూస్తారు. మూడవ నిమిషం కేవలం సినిమా అభిమానులు మాత్రమే చూస్తున్నట్టు ఫీల్ అవుతారు. ఫ్యాన్డమ్ నీ పక్కకు పెట్టేసి కేవలం సినిమాని సినిమాగా మాత్రమే ఆస్వాదిస్తారు" అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ఇక రోజు రోజుకి సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.

admin1

admin1

Next Story