Top
logo

నానీని చూస్తే గర్వంగా ఉంది : జూ. ఎన్టీఆర్‌

నానీని చూస్తే గర్వంగా ఉంది : జూ. ఎన్టీఆర్‌
X
Highlights

ఎంతో నమ్మకం తో నాని జెర్సీ అనే సినిమా ని చేసాడు. విడుదల ముందు నాని సినిమా విజయం పై చాలా విశ్వాసం ఉంచాడు. నేడు...

ఎంతో నమ్మకం తో నాని జెర్సీ అనే సినిమా ని చేసాడు. విడుదల ముందు నాని సినిమా విజయం పై చాలా విశ్వాసం ఉంచాడు. నేడు సినిమా విడుదల అయ్యాక వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే నాని ఎంత గర్వపడుతూ ఉంటాడో అర్ధం అవుతుంది. అలాగే ఈ సినిమా ని చూసి అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నాని ని చూసి గర్వపడుతున్నట్టు ఆయన చెప్పడం విశేషం. "జెర్సీ ఒక ఔత్స్టాండింగ్ సినిమా. సినిమా చూస్తున్న అంత సేపు ఒక రోలర్ కోస్టర్ రైడ్ చేసిన అనుభూతి కలిగింది.

మంచి కథ ని ఎంచుకొని దానిని అంతే బాగా చెప్పగలిగినందుకు దర్శకుడు గౌతమ్ కి హాట్స్ఆఫ్. అద్భుతం గా, అద్వితీయంగా ఈ సినిమా కథ ని చెప్పాడు దర్శకుడు. ఈ చిత్రానికి పని చేసిన నటీ నటులకి, సాంకేతిక నిపుణలకి అందరికీ నా అభినందనలు. ప్రతి ఒక్కరు తమ పని తీరు తో దర్శకుడి విజన్ ని హైలైట్ అయేలా పని చేశారు. నా సోదరుడు నాని ఈ సారి బాల్ ని పార్క్ అవతలకి గట్టిగా కొట్టాడు. తన నటన అద్భుతంగా ఉంది. ఎంతో చక్కగా నటించాడు. రాబోయే చాలా కాలం వరకు నాని పెర్ఫార్మన్స్ ని నేను గుర్తు ఉంచుకుంటాను. నాని ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను." అని తారక్ ట్వీట్ చేసాడు. తారక్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ఈ సినిమా ని చూసి తమ తమ అభినందనలు తెలుపుతున్నారు.Next Story