Jr NTR: నెపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు – "నేను అలాంటోడిని కాదు!"

Jr NTR: నెపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు – నేను అలాంటోడిని కాదు!
x

Jr NTR: నెపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు – "నేను అలాంటోడిని కాదు!"

Highlights

జూనియర్ ఎన్టీఆర్ నెపోటిజంపై చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్, అదే సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంతో పాటు తన అభిప్రాయాలను చర్చించారు.

తండ్రిగా తన పాత్ర గురించి మాట్లాడుతూ –

“నా కొడుకులు యాక్టర్లే కావాలని ఎప్పుడూ ప్రోత్సహించను. అలాంటి నిబంధనలు నాకు నచ్చవు. నేను వారికో అడ్డుగోడగా కాకుండా, ఒక బ్రిడ్జ్‌గా ఉండాలని భావిస్తున్నాను. ఈ ప్రపంచాన్ని వాళ్లకు నా కళ్లతో చూపించాలనుకుంటున్నాను. అదే సమయంలో, వాళ్లే స్వయంగా తెలుసుకునేలా స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాను,” అని పేర్కొన్నాడు.

అలాగే తాను తండ్రి అయిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులను గురించి కూడా వివరించాడు –

“నాకు ప్రొమోషన్ (తండ్రిగా మారటం) వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది. అది నా జీవనశైలినే కాదు, నా వృత్తిపై కూడా ప్రభావం చూపింది. ఇకపై చేసే ప్రతి పాత్రలో నేను సవాలు ఉండాలని, ఈజీగా చేయకూడదని నిర్ణయించుకున్నాను. నూతనత కోసం ప్రయత్నించాలనే ఆలోచన అప్పటి నుంచి మొదలైంది,” అని స్పష్టం చేశాడు.

ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఒక స్టార్ కిడ్డుగా ఇండస్ట్రీలోకి వచ్చి తన ప్రతిభతో గుర్తింపు సంపాదించిన ఎన్టీఆర్... నెపోటిజంపై ఈ విధమైన స్పష్టత ఇవ్వడం ఎంతో మంది మెచ్చుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories