మీరే నా బలం.. ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్!

మీరే నా బలం.. ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్!
x
Tollywood Jr Ntr (file photo)
Highlights

టాలీవుడ్ యాంగ్ టైగర్, అగ్రకథనాయకుడు జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

టాలీవుడ్ యాంగ్ టైగర్, అగ్రకథనాయకుడు జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఇవాళ ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సందర్భంగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తన సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని తారక్ అన్నాడు. అందరి ట్వీట్లు చదవడం గొప్పగా అనిపించిందని... మీరందరూ ఈరోజును మరింత స్పెషల్ గా మార్చారని చెప్పారు.

''మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.





Show Full Article
Print Article
Next Story
More Stories