
స్టైలీష్ స్టార్ హీరో అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నుంచి వచ్చిన మూడో చిత్రం అల వైకుంఠపురములో... ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
స్టైలీష్ స్టార్ హీరో అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నుంచి వచ్చిన మూడో చిత్రం అల వైకుంఠపురములో... ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదివారం విడుదలైన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.
అల్లు అర్జున్ సినిమా హిట్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండగ ముందే తమకు మరో పెద్ద పండగ వచ్చిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. దీంతో ఈ సినిమాపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'అల.. వైకుంఠపురములో' సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ ట్విట్ చేశారు.
ఈ సందర్బంగా ఎన్టీఆర్ తన ట్విట్‌లో అల వైకుంఠపురములో.. సినిమా అదిరిపోయింది. మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు బాగున్నాయి. తనకు మాత్రమే సాథ్యమని నిరుపించారు. కంగ్రాట్స్ బావా అండ్ స్వామీ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మరో ట్విట్ లో తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. మురళీశర్మ యాక్టింగ్ హ్యాట్సాఫ్. సినిమా విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ ఎన్టీఆర్ ట్విటర్ లో తెలిపారు.
అల వైకుంఠపురములో చిత్రం విడుదలైంది.అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటించింది. ఈ సినిమాతో సినీయర్ నటి టబు రీఎంట్రీ ఇవ్వడం, తమన్ అందించిన పాటలకి మంచి క్రేజ్ రావడం, టీజర్, ట్రైలర్స్ లలో త్రివిక్రమ్ మార్క్ కనిపించడం సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాల్లో ఈ సినిమా హిట్ టాక్ సాధించింది. దీంతో విడుదలైన అన్ని చోట్ల భారీ వసూళ్లుతో దూసుకుపోతుంది.
Kudos to Murali Sharma for supporting them with a a great performance. Outstanding work by @MusicThaman is a major asset for the film. Special mention for PS Vinod 's cinematography. Congratulations to the entire team and @haarikahassine for a job well done.
— Jr NTR (@tarak9999) January 12, 2020
An effortless and terrific performance from @alluarjun and brilliant writing from Trivikram Srinivas garu make #AlaVaikuntapurramuloo a great watch. Congrats Bava and Swamy
— Jr NTR (@tarak9999) January 12, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




