తాత పాత్రకి మరోసారి నో చెప్పిన ఎన్టీఆర్ ?

NTR
x
NTR
Highlights

ఇక కంగన రనౌత్ మెయిన్ లీడ్ లో జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంది. దీనికి తలైవి అనే పేరు పెట్టారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు పాత్రను చేసేందుకు ఎన్టీఆర్ మరోసారి నో చెప్పినట్టుగా తెలుస్తుంది. గతంలో మహానటి సినిమాకి గాను సీనియర్ ఎన్టీఆర్ పాత్రకి జూనియర్ ని అడిగారు. కానీ అయనలాగా నటించడం పెద్ద సవాల్ అని తారక్ సున్నితంగా తిరస్కరించారు.

ఇప్పుడు తమిళనాడులో జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో తారక్ నటించబోతున్నారని గత కొద్దిరోజుల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ కూడా ఎన్టీఆర్ ని సంప్రదించిన మాట వాస్తవేనని, కానీ అయన తిరస్కరించరని వినికిడి.. దీనిపైన చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

ఇక కంగన రనౌత్ మెయిన్ లీడ్ లో జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంది. దీనికి తలైవి అనే పేరు పెట్టారు. ఎ. ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జయలలితగా కంగన నటిస్తుండగా, ఎంజీఅర్ గా అరవింద్ స్వామి కనిపించనున్నారు. హిందీ, తమిళ్ , తెలుగు భాషలలో సినిమాని నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories