జక్కన్న బాటలోనే గూరుజీ

జక్కన్న బాటలోనే గూరుజీ
x
Highlights

తాజాగా 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్ కూడా వచ్చేసింది. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇది ఎన్టీఆర్ కి 30 వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని 2021 సమ్మర్ కి రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడట!

ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దీనితో మళ్ళీ ఇదే కాంబినేషన్ నుంచి సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు 28 సినిమాలు చేసి చాలా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ బాలీవుడ్ మార్కెట్ ని టచ్ చేయలేదు.. అయితే త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాని పాన్ ఇండియా లెవల్ లో డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది!

ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కంటే ముందే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా 2021 జనవరికి రిలీజ్ అవుతుంది కాబట్టి నార్త్ లో ఎన్టీఆర్ ఎంట్రీ అయిపోతుంది. సో ఈ సినిమా వేడి చల్లరకముందే మరోసారి హిందీ ప్రేక్షకుల ముందుకు ఎన్టీఆర్ సినిమాని తీసుకురావాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నాయట.. ! ఇక ఈ సినిమాకి పూజా హేగ్దేని హీరోయిన్ ఒకే అయినట్టు సమాచారం.

కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ...

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తరవాత త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories