Journalist TNR ఇక‌లేరు.. క‌రోనాతో కన్నుమూత

Corona: Journalist TNR Died Due to Coronavirus
x
టీఎన్ఆర్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Journalist TNR: ప్రముఖ జర్నలిస్ట్‌, యూట్యూబ్‌ యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి)కరోనాతో కన్నుమూశారు.

Corona: ప్రముఖ జర్నలిస్ట్‌, యూట్యూబ్‌ యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి)కరోనాతో కన్నుమూశారు. గ‌త‌ కొన్ని రోజుల కిందట ఆయన కరోనా బారినపడగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. యూట్యూబ్‌ వేదికగా ఎంతో మంది సినిమా ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. అతిథిలు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన సంధించే ప్రశ్నలు సూటిగా ఉండేవి. అంతేకాదు, నటుడిగానూ టీఎన్‌ఆర్‌ తనదైన ముద్రవేశారు.

ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అంటూ సూటిగా, సుత్తి లేకుండా ఇంటర్వ్యూలు చేసే టీఎన్‌ఆర్‌కు యూత్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. టిఎన్ఆర్‌కు అనారోగ్యం అని తెలియగానే ఆయన కోలుకోవాలంటూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక టీఎన్‌ఆర్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.తుమ్మల నరసింహారెడ్డి(టీఎన్‌ఆర్‌) డిగ్రీ అయ్యాక సినిమాల మీద దర్శకత్వంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. చిరంజీవి ఆయన అభిమాన నటుడు. చిరు సినిమాలు చూసి స్ఫూర్తి పొందేవారు. 1992లో దేవదాస్‌ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నారు.

స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ వద్ద సహాయకుడిగా పనిచేశారు. పలు చిత్రాలకు రచనలో సహకారం అందించారు. హాస్యనటుడు అలీ, చిరు 'హిట్లర్‌' చిత్రాలకు స్క్రిప్ట్‌లో పాలు పంచుకున్నారు., దర్శకుడిగా, రచయితగా సినిమాల వైపు రాకుండా బుల్లితెరకు వెళ్లారు. పలు న్యూస్‌ ఛానళ్లలో విలేకరిగా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories