Thug Life: థ‌గ్ లైఫ్ విడుద‌ల వేళ‌.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన జోజు జార్ట్‌, కూతురుతో క‌లిసి

Thug Life
x

Thug Life: థ‌గ్ లైఫ్ విడుద‌ల వేళ‌.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన జోజు జార్ట్‌, కూతురుతో క‌లిసి

Highlights

Thug Life: కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ సినిమా నేడు (జూన్ 5) థియేటర్లలో విడుదలై భారీ స్పందన తెచ్చుకుంటోంది. విడుద‌లైన తొలి షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ నేప‌థ్యంలో హీరో జోజు జార్జ్ తన కుమార్తె సరాతో కలిసి పాడిన ఓ ఎమోషనల్ వీడియోతో అభిమానుల మనసులను గెలుచుకున్నారు. జోజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో తండ్రి, కుమార్తె ఇద్దరూ కలిసి ‘థగ్ లైఫ్’లోని పాటను పాడారు. దీంతో ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. త‌మిళంలో ఈ పాటను ఢీ ఆల‌పించ‌గా తెలుగులో, హిందీలో చిన్మయి శ్రీపాదా పాడారు. ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌లో చిన్మయి తన లైవ్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆమె పాడిన ఎమోషనల్ వెర్షన్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో, చిన్మయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ థ్యాంక్స్ నోట్ కూడా పోస్ట్ చేశారు.

38 ఏళ్ల తర్వాత మణిరత్నం - కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. రిలీజ్‌కు ముందే రూ. 10 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తవడం విశేషం. అన్ని భాషల్లో కలిపి మూడున్నర లక్షల టికెట్లు అమ్ముడైయ్యాయని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు. మొదటి రోజు దేశవ్యాప్తంగా 8,400 షోలు ప్లాన్ చేసినట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories