Jigris: కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా జిగ్రీస్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా జిగ్రీస్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
x

కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా జిగ్రీస్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Highlights

ఇటీవల ఘనంగా జరిగిన ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదలైన ‘జిగ్రీస్’ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ దాటుతూ యువతలో భారీ బజ్ క్రియేట్ చేసింది.

హైదరాబాద్‌: ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదలైన జిగ్రీస్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ దాటుతూ యూత్‌లో మంచి బజ్ సృష్టించింది.

ఇక తాజాగా, ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ “తిరిగే భూమి”ను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేశారు. పాట విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ పాట చాలా ఎనర్జీటిక్‌గా ఉంది. కమ్రాన్ సయ్యద్ అందించిన ట్యూన్ ఫ్రెష్‌గా ఉంది, లిరిక్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. టీజర్‌నే ముందే చూసి బాగా నచ్చింది. నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే, అందుకే కొత్త వాళ్లకు ఎప్పుడూ ప్రత్యేక ఇష్టం ఉంటుంది. జిగ్రీస్ టీమ్ ఎంతో ప్యాషన్‌తో పనిచేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నా” అని పేర్కొన్నారు.

ఈ పాటను T-Series మ్యూజిక్ లేబుల్లో విడుదల చేశారు. టీజర్‌తో వచ్చిన క్రేజ్‌కి తోడు, ఈ పాట కూడా యువతలో మంచి హిట్‌గా మారుతోంది.

జిగ్రీస్ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తుండగా, మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories