Jeevitha Rajasekhar: చెక్ బౌన్స్ కేసు పై రియాక్ట్ అయిన జీవిత...

Jeevitha Rajasekhar: చెక్ బౌన్స్ కేసు పై రియాక్ట్ అయిన జీవిత...
Jeevitha Rajasekhar: ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ మరియు జీవిత చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే...
Jeevitha Rajasekhar: ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ మరియు జీవిత చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. "గరుడ వేగా" సినిమా నిర్మాణం కోసం దగ్గర డబ్బులు అప్పు తీసుకొని ఇప్పుడు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని కోటేశ్వర్ రాజు కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తల పై నోరు విప్పారు జీవితారాజశేఖర్. న్యాయస్థానం పై తమకి పూర్తి నమ్మకం ఉందని అందుకే ఈ విషయాల్లో లీగల్ గానే ముందుకు వెళ్తామని చెబుతున్నారు జీవిత.
"అసలు గరుడ వేగా సినిమా నిర్మించింది కోటేశ్వర్ రాజు, అలాంటిది మేము ఆయన దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నామని ఎలా చెబుతారు. సినిమాకి నిర్మాత కాకపోతే సినిమా కోసం ఇంకెవరు ఖర్చు పెడతారు" అని నిలదీశారు జీవిత. ఇక సినిమా నిర్మాణం తో కోటేశ్వర రాజు భార్య హేమా కి ఎటువంటి సంబంధం లేదని కానీ ఇప్పుడు కేసు విషయంలో ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని అడిగారు జీవిత.
"మా మీద కేసు రెండు నెలల క్రితమే నమోదు చేశారు. అది ఇంకా నడుస్తూనే ఉంది. కేసు పెట్టిన తర్వాత కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్లు మా పరువు తీయాలని ప్రయత్నిస్తున్నారు కానీ మేము అవి పట్టించుకోము. ఇలాంటి అబద్ధపు ఆరోపణల విషయంలో మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము" అని చెప్పుకొచ్చారు జీవిత.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT