Jeevitha: అందుకే ఆ సినిమాకి దర్శకత్వం వహించిన జీవిత

Jeevitha Direction on Rajasekhar Film Shekar | Tollywood News
x

అందుకే ఆ సినిమాకి దర్శకత్వం వహించిన జీవిత

Highlights

Jeevitha: "అది రాజశేఖర్ సినిమా అవుతుందేమో అని అనుకున్నాము" అంటున్న జీవిత

Jeevitha: సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో "శేఖర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "జోసఫ్" అనే సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆలీతో సరదాగా షో కి వచ్చారు జీవిత మరియు రాజశేఖర్. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ శేఖర్ సినిమాకి జీవిత దర్శకత్వం వహించాల్సి రావడానికి గల కారణం చెప్పుకొచ్చారు.

"సినిమా షూటింగ్ మరొక వారం రోజుల్లో మొదలవుతుంది అనగా రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది. ఆయన కోలుకోవడానికి నెల పట్టింది" అని చెప్పిన జీవిత ఇది రాజశేఖర్ ఆఖరి సినిమా అవుతుందేమోనని ఆందోళనతోనే ఆమె ఈ సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకున్నట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరో వైపు ఈ సినిమాలో రాజశేఖర్ లుక్ చాలా విభిన్నంగా ఉండబోతోందని ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఉంటారని ఆయనని మెచ్చుకుంటారు అని అన్నారు జీవిత.

Show Full Article
Print Article
Next Story
More Stories