Sridevi: మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకోలేదు..శ్రీదేవిపై జయప్రద కీలక వ్యాఖ్యలు

Samba Siva Rao
Published on: 22 April 2021 9:38 PM IST
Sridevi and Jaya prada
X

శ్రీదేవి జయప్రద ఫైల్ ఫోటో  

Sridevi: తెలుగు చిత్రసీమలో అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి, సీనియర్ హీరోయిన్ జయప్రద కొన్ని దశాబ్దాల క్రితం వెండితెరను ఏలారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల్లో పోటీపడ్డ హీరోయిన్లు. అన్ని భాషల్లో అగ్రకథానాయకులతో కలిసి నటించిన ఈ వెటరన్ హీరోయిన్ల గురించి ఇప్పటికి తెలియని ఓ విషయం అలానే ఉంది. శ్రీదేవి, జయప్రద వెండితెరను ఏలుతున్న సమయంలో వారి మధ్య అసలు మాటలు లేవంట. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించినా.. ఒక్కసారి కూడా మాట్లాడులేదంట. ఈ విషయాలన్ని స్వయంగా జయప్రదనే వివరించారు.

ఇండియన్ ఐడల్ 12 కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద అనే అంశాలపై తన మనసులోని మాటను బయటపెట్టింది. శ్రీదేవి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఇక జయప్రద ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. అనేక అంశాలపై మాట్లాడిన జయప్రద... తన తోటి నటి శ్రీదేవితో ఉన్న సంబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. యాక్షన్ అనగానే మాట్లాడుకోవడం కట్ అనగానే మళ్లీ ఎవరి పని వాళ్లు చూసుకోవడం తప్పితే.. రియల్ లైఫ్‌లో ఈ ఇద్దరు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. వీరి తీరు చూసిన నాటి బాలీవుడ్ స్టార్స్ రాజేశ్ ఖన్నా, జితేంద్ర.. ఓసారి షూటింగ్ సమయంలో వీరిద్దరి మేకప్ రూమ్‌లో ఇద్దరిని ఉంచి గంటపాటు తాళం వేశారట. అయినా ఆ గంట సమయంలోనూ వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే శ్రీదేవి మరణవార్త తెలియగానే తాను ఎంతో బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిద్దరు కలిసి దేవత, ముందడుగు, మండే గుండేలు, అడవి సింహాలు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story