
Jawan vs Dhurandhar: బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్.. షారుఖ్, రణ్‌వీర్‌లో విన్నర్ ఎవరు?
Jawan vs Dhurandhar: భారత సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల హవా కొనసాగుతోంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ పరిశ్రమల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి.
Jawan vs Dhurandhar: భారత సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల హవా కొనసాగుతోంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ పరిశ్రమల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు పాన్ ఇండియా హిట్స్ అందుకున్నాయి. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’, యువ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ రెండు సినిమాలు విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల పరంగా, ఇంపాక్ట్ పరంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. తాజాగా ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ గణాంకాలను పోల్చితే.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
థియేటర్ల పరంగా చూస్తే జవాన్, ధురంధర్ రెండూ దాదాపు సమాన స్థాయిలో విడుదలయ్యాయి. రెండు సినిమాలు కూడా దాదాపు 4500 స్క్రీన్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఓపెనింగ్ డే కలెక్షన్లలో మాత్రం జవాన్ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. జవాన్ మొదటి రోజు సుమారు రూ.75 కోట్ల నెట్ వసూలు చేయగా.. ధురంధర్ రూ.28.60 కోట్లతో ఓపెనింగ్ చేసింది. అయితే మౌత్ టాక్, కంటెంట్ బలంతో ధురంధర్ క్రమంగా పుంజుకుంది. ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లలోనూ జవాన్ దూకుడు కనిపించింది. జవాన్ మూడు రోజుల్లోనే సుమారు రూ.207 కోట్ల నెట్ వసూలు చేయగా.. ధురంధర్ రూ.106.5 కోట్లతో బలమైన స్టార్ట్ ఇచ్చింది.
లాంగ్ రన్‌లో మాత్రం ధురంధర్ తన సత్తా చాటింది. ఇండియా లాంగ్ రన్ నెట్ కలెక్షన్లలో జవాన్ రూ.642 కోట్ల వద్ద నిలిచితే.. ధురంధర్ రూ.895 కోట్లకు పైగా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఫుట్‌ఫాల్స్ పరంగా చూస్తే జవాన్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది. జవాన్‌ను దాదాపు 3.92 కోట్ల మంది ప్రేక్షకులు థియేటర్లలో చూశారు. ధురంధర్‌ను 3.55 కోట్ల మంది వీక్షించారు. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ జవాన్ ముందంజలో ఉంది. జవాన్ విదేశాల్లో సుమారు 49 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేయగా.. ధురంధర్ 32.75 మిలియన్ డాలర్లతో బలమైన ప్రదర్శన చేసింది.
వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్లలో మాత్రం ధురంధర్ మూవీ జవాన్‌ను దాటేసింది. జవాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1060 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ధురంధర్ రూ.1350 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్గా నిలవడం విశేషం. మొత్తంగా చూస్తే జవాన్, ధురంధర్ రెండూ ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవల్లో మరింత పెంచాయి. భారీ కలెక్షన్లు, మాస్ ఆడియెన్స్ కనెక్ట్, పాన్-ఇండియా రేంజ్‌తో ఈ రెండు చిత్రాలు భారతీయ సినిమాను గర్వపడేలా చేశాయనే చెప్పాలి. అయితే షారుఖ్ ఖాన్‌కు ఉండే ఫ్యాన్ బేస్ రణ్‌వీర్ సింగ్‌కు లేదు. అయినా కూడా కింగ్ రికార్డులను యువ హీరో బద్దలు కొట్టడం విశేషం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




