Jathi Ratnalu Review: కడుపుబ్బా నవ్వించిన 'జాతిరత్నాలు' సినిమా రివ్వూ

Jathi Ratnalu Movie Review
x

ఇమేజ్ సోర్స్: ది హన్స్ ఇండియా

Highlights

Jathi Ratnalu Review: ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా సాగే జాతి రత్నాలు సినిమా అందరినీ ఆకట్టుకునేలానే ఉంది.

Jathi Ratnalu Review: మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు జాతిరత్నాలు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. చిన్న సినిమానే అయినా అల్టిమేట్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకు తట్టుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం.

తన ఫ్రెండ్స్ తో హైదరాబాద్ కు..

ఊర్లో లేడీస్ ఎంపోరియంలో పనిచేసే హీరో ఆ జాబ్ నచ్చక… హైదరాబాదు కి వస్తాడు, తన ఫ్రెండ్స్ తో కలిసి ఉంటాడు, అనుకోకుండా వీళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అసలు జైలు ఎందుకు వెళ్ళారు, వీళ్ళు చేసిన క్రైం ఏంటి, మరి జైలు నుండి ఎలా బయట పడ్డారు లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ చాలా చాలా సింపుల్ స్టొరీ పాయింట్, కానీ డైరెక్టర్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు.

వన్ మ్యాన్ షో...

నవీన్ పాలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి, తన కామిక్ టైమింగ్ కానీ, యాక్టింగ్ కానీ ఫ్రెష్ గా మెప్పిస్తాయి, నవీన్ కి ఇటు ప్రియదర్శి అటు రాహుల్ రామకృష్ణ ఇద్దరూ బాగా హెల్ప్ అయ్యారు, ఇక హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకోగా మిగిలిన నటీనటులు కూడా మెప్పించారు.

హిలేరియస్ కామెడీ తో ఫస్టాఫ్...

ఫస్టాఫ్ హిలేరియస్ కామెడీ తో సింగిల్ లైన్ పంచులతో ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుంది, అబ్బ అదిరిపోయిందిగా సినిమా అనుకుంటూ ఉంటె సెకెండ్ ఆఫ్ మొదలు అవ్వడం, డ్రాగ్ అవ్వడం, ఫస్టాఫ్ రేంజ్ లో కామెడీ వర్కౌట్ అవ్వకపోవడంతో సెకెండ్ ఆఫ్ యావరేజ్ గా ఉందనిపిస్తూ సినిమా ముగుస్తుంది… మెదక్ జిల్లా జోగిపేట శ్రీకాంత్ (నవీన్ పొలిశెటి), రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి) అల్లరిచిల్లరగా బాధ్యత లేకుండా తిరిగే యువకులు. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియం షాపులో అయిష్టంగానే పని చేసే శ్రీకాంత్ ఉద్యోగం కోసం తన స్నేహితులతో కలిసి హైద్రాబాద్ర‌కు వస్తాడు. ఆ తరువాత చిట్టి (ఫరియా)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత ముగ్గురు స్నేహితుల జీవితంలో చోటు చేసుకున్న మార్పులే జాతి రత్నాలు.

కామెడీ ప్రధానంగా...

కామెడీ ప్రధానంగా సాగే జాతిరత్నాలు ఫస్టాఫ్ మొత్తం నవ్వించేశారు. శ్రీకాంత్, రవి, శేఖర్ ముగ్గురు స్నేహితుల మధ్య వచ్చే సంభాషణతో కథనం అలా ముందుకు సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకునేలా ఈ మూవీ ప్రథమార్థం సాగుతూ ఉంటుంది. డైలాగ్స్, పాటలు అన్నీ కూడా ప్రథమార్థాన్ని నిలబెట్టేశాయని చెప్పవచ్చు. ఇంకా ఇంటర్వెల్‌కు అసలు కథ తిరుగుతుంది. కానీ అక్కడక్కడా రొటీన్ సీన్స్‌తో బోర్ కొట్టించినట్టు అనిపిస్తుంది. బ్రహ్మానందంపై తెరకెక్కించిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి ద్వితీయార్థం కూడా ప్రేక్షకులను ఓ మోస్తరుగా మెప్పిస్తుంది. డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాను ఆద్యంతం వినోదభరితంగా మలిచే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఆ కోణంలో దర్శకుడు వంద మార్కులు సాధించేశాడు. ఆ ముగ్గురు ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా ప్రేక్షకులను నవ్వించడం మాత్రం మరిచిపోలేదు.ఈ విషయంలో దర్శకుడి రచన ప్రతిభ కనిపిస్తుంది.

కామెడీతో ఆకట్టుకున్న నవీన్...

నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇది వరకు ఎన్నో సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. జాతి రత్నాలు విషయానికొస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నవీన్ గురించే. కామెడీ టైమింగ్ ఉన్న అతి కొద్ది మంది హీరోల జాబితాలో నవీన్ పేరు చేర్చవచ్చు. అంతలా తన కామెడీతో ఆకట్టుకున్నాడు.

చిట్టి పాత్రలో ఒదిగిన హీరోయిన్..

జాతి రత్నాలు సినిమాలో హీరోయిన్ ఫరియా గురించి చెప్పుకోవాలి. చిట్టి పాత్రలో ఎంత క్యూట్‌గా కనిపించిందో.. అంతే స్థాయిలో నటించేసింది. చిట్టిగా తన నటనతో ఫరియా ప్రేక్షకులను మెప్పించేసింది.

అలరించిన మ్యూజిక్..

జాతిరత్నాలు సినిమా విషయానికి వస్తే ముందుగా సంగీతం గురించే చెప్పుకోవాలి. రదన్ అందించిన సంగీతం, కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ముఖ్యంగా పాటలు కొట్టిన విధానం, తెరకెక్కించిన విధానం అన్నీ కూడా ఆకట్టుకున్నాయి.

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా సాగే జాతి రత్నాలు సినిమా అందరినీ ఆకట్టుకునేలానే ఉంది. వినోదం ఆశించి వెళ్లే ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా నిరాశ చెందడు. చివరకు నిజంగానే జాతి రత్నాలు అని ప్రేక్షకుల చేతే అనిపిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories