Janhvi Kapoor: తల్లి బాటలోనే తనయ.. జాన్వీ స్కెచ్‌ అదేనా.?

Janhvi Kapoor: తల్లి బాటలోనే తనయ.. జాన్వీ స్కెచ్‌ అదేనా.?
x
Highlights

Janhvi Kapoor: బాలీవుడ్‌లో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీతో పాటు పలు డీగ్లామర్‌ రోల్స్‌లో నటించి మెప్పించింది.

Janhvi Kapoor: అలనాటి అందాల తార జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుందీ చిన్నది. నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కెరీర్‌ తొలినాళ్ల నుంచి నటకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వచ్చింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీతో పాటు పలు డీగ్లామర్‌ రోల్స్‌లో నటించి మెప్పించింది.

అయితే కెరీర్‌ మొదలు పెట్టిన చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని సౌత్‌లో సాలిడ్‌ ఎంట్రీ ఇచ్చింది. దేవర మూవీలో ఎన్టీఆర్‌ సరసన నటించిన ఈ చిన్నది ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. 'చుట్టమల్లె చుట్టేసింది' ఈ పక్క పాటతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాలో జాన్వీ పాత్రకు పెద్దగా నిడివి లేకపోయినా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే జాన్వీ టాలీవుడ్‌లో పాగా వేసేందుకు గట్టిగానే ప్లాన్‌ చేసినట్లు ఆమె లైనప్‌ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఆర్సీ 16లో నటిస్తోందీ బ్యూటీ. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది కాగా నాని - శ్రీకాంత్‌ ఓదెల ప్రాజెక్టులో జాన్వీని హీరోయిన్‌గా అనుకుంటున్నట్టు వార్తలు చచిన విషయం తెలిసిందే.

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ఇక చెర్రీ సినిమా కంప్లీట్‌ కాగానే అల్లు అర్జున్‌ సెట్స్ కి వెళ్తారట జాన్వీ. అట్లీ డైరక్షన్‌లో ఐకాన్‌స్టార్‌ నటిస్తున్న సినిమాలో నాయికగా జాన్వీ కపూర్‌ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అయితే అందరూ బాలీవుడ్‌ హీరోయిన్లలా ఇలా వచ్చి అలా పోకుండా జాన్వీ టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్లాన్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories