ఎన్టీఆర్ సినిమా కోసం లుక్ టెస్ట్ లో పాల్గొన్న జాన్వీ కపూర్

Janhvi Kapoor Participated in the Look Test for NTR Movie
x

ఎన్టీఆర్ సినిమా కోసం లుక్ టెస్ట్ లో పాల్గొన్న జాన్వీ కపూర్

Highlights

Janhvi Kapoor: లుక్ టెస్ట్ లో పాల్గొన్న #ఎన్టీఆర్30 హీరోయిన్

Janhvi Kapoor: ఈ మధ్యనే రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు తన తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో విడుదలైంది కానీ సినిమా మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు.

ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం అడగగా తారక్ వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ కూడా చేశారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనుంది అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మధ్యనే చిత్ర బృందం జాన్వి కపూర్ తో లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ సినిమాలో ఈమె పాత్రకి సంబంధించిన లుక్ టెస్ట్ ని నిర్వహించారట. అందులో ఈ పాత్రకి జాన్వికపూర్ చాలా బాగా సెట్ అయినట్లు చిత్ర బృందం చెబుతోంది. ఒకవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకు వెళుతున్న జాన్వి కపూర్ ఎన్టీఆర్ సినిమాతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. లెజెండరీ నటి శ్రీదేవి పెద్ద కూతురిగా మాత్రమే తెలిసిన జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా తన సత్తా చాటనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories