పవర్ స్టార్ సినిమాలపై నిలిపివేత

పవర్ స్టార్ సినిమాలపై నిలిపివేత
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీ పై వేసే ఎత్తుగడలు కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. తమ...

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీ పై వేసే ఎత్తుగడలు కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. తమ పార్టీ ప్రచారాలతో పాటే ఇతర పార్టీల ప్రభావం ప్రజల మీద పడకూడదు అని కూడా రాజకీయ నాయకులు జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కన్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పడింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ప్రజలపై ప్రభావం చూపిస్తాయేమోనని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. అందుకే వారు ఈ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలు పూర్తయేంతవరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లలో కానీ టీవీ ఛానళ్లలో కానీ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను ప్రదర్శించకూడదని వాటిని నిలిపివేయమని కేంద్ర ఎన్నికల కమిషన్ ను టిడిపి కలవనుంది. నిజానికి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో పొలిటికల్ సినిమాలు అంటూ ఏమీ లేవు. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా తప్ప మిగతా ఏ సినిమాలోనూ పొలిటికల్ యాంగిల్స్ అంతగా లేవు. అయినప్పటికీ టిడిపి కోరిక మేరకు ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీయ

సుకుంటుందో తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories