Jana Nayagan Release Postponed: ఏకంగా 50 కట్స్! విజయ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Jana Nayagan Release Postponed: ఏకంగా 50 కట్స్! విజయ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
x
Highlights

విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు సెన్సార్ బోర్డు 50 కట్స్ సూచించింది. జనవరి 14న కొత్త రిలీజ్ డేట్ ఖరారైన నేపథ్యంలో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

కోలీవుడ్ దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు ఒకవైపు గుడ్ న్యూస్, మరోవైపు షాకింగ్ న్యూస్. సెన్సార్ ఇబ్బందుల కారణంగా జనవరి 9న విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ మరియు సెన్సార్ బోర్డు పెట్టిన కట్స్ గురించి ఆసక్తికర వార్తలు బయటకు వచ్చాయి.

50కి పైగా కట్స్.. విజయే టార్గెటా?

తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ మార్క్ పొలిటికల్ డైలాగులు గట్టిగానే ఉన్నాయట. అయితే ఈ డైలాగులు మరియు కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఏకంగా 50కి పైగా కట్స్ బోర్డు సూచించిందట.

సినిమాలో ఉన్న పొలిటికల్ రిఫరెన్సులు సమాజంలో గొడవలకు దారితీస్తాయనే కారణంతో వాటిని మ్యూట్ చేయాలని లేదా తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం.

ఇతర హింసాత్మక సినిమాలకు సులభంగా సర్టిఫికెట్ ఇచ్చే బోర్డు, విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే లక్ష్యంగా ఇలా చేస్తోందని దళపతి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

కొత్త రిలీజ్ డేట్ ఖరారు!

సెన్సార్ అభ్యంతరాల నేపథ్యంలో చిత్ర యూనిట్ కొన్ని మార్పులకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి (పొంగల్) కానుకగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండగ బరిలో విజయ్ సినిమా వస్తుండటంతో థియేటర్ల వద్ద సందడి మొదలవ్వనుంది.

కోలీవుడ్‌లో పొంగల్ టెన్షన్!

మరోవైపు శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ సినిమాకు కూడా ఇప్పటివరకు సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. ఒకవేళ ఈ రెండు సినిమాలకు సెన్సార్ అడ్డంకులు తొలగకపోతే, ఈ ఏడాది తమిళ తంబీలకు పొంగల్ రేసులో పెద్ద సినిమాలు లేనట్టేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ‘జన నాయగన్’తో విజయ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ‘తాండవం’ చేస్తాడో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories