Actress: జై మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా? అసలేం చేస్తోందంటే..


Jai movie actress Santhoshi srikar: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కొద్ది కాలమే లైమ్ లైట్‌లో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్...
Jai movie actress Santhoshi srikar: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కొద్ది కాలమే లైమ్ లైట్‌లో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ హీరోయిన్లుగా రాణించిన వారు కూడా ఒక్కసారిగా వెండి తెరకు దూరమైన వారున్నారు. తమ అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తమ వ్యక్తిగత జీవితాలతో బిజీగా గపడుతున్నారు. అలాంటి ఒక నటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
నవదీప్ హీరోగా వచ్చిన జై మూవీ గుర్తుండే ఉంటుంది. తేజ దర్శకత్వంలో 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. బాక్సింగ్ బ్యాగ్రౌండ్‌తో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో నవదీప్‌కు జోడిగా సంతోషి శ్రీకర్ నటించింది. ఫరా అనే పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
తన అమాయక నటన, అందంతో కుర్రకారును ఫిదా చేసింది. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ టీవీ నటి పూర్ణిమ కూతురే సంతోషి. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు ప్రసాద్ బాబుకు స్వయంగా కోడలు. విజయవాడలో పుట్టిన సంతోషి చెన్నైలో పెరిగింది. 2000లో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది జై సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. జై తర్వాత సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో పని మనిషి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి క్రమంగా దూరమవుతూ వచ్చింది సంతోషి. సినిమాలకు దూరంగా ఉన్న సంతోషి ఆ తర్వాత స్వయంగా వ్యాపారం ప్రారంభించింది. బొటిక్ అండ్ బ్యూటీ లాంగ్ పేరుతో వ్యాపారం రన్ చేస్తోంది. మేకప్ క్లాసెస్, శారీ డ్రేపింగ్ తదితర ఫ్యాషన్ డిజైనింగ్ అంశాలకు సంబంధించి శిక్షణ కూడా ఇస్తోంది. చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. సినిమాలకు దూరంగా ఉన్నా తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



