Actress: జై చిరంజీవ చిన్నారి.. ఇప్పుడెలా మారిందో తెలుసా.? అస్సలు ఊహించలేరు

Actress: జై చిరంజీవ చిన్నారి.. ఇప్పుడెలా మారిందో తెలుసా.? అస్సలు ఊహించలేరు
x
Highlights

Actress: చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్‌ మొదలు పెట్టి హీరోయిన్‌లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఒకరు జై చిరంజీవ సినిమాలో నటించిన శ్రియ శర్మ ఒకరు.

Actress: చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్‌ మొదలు పెట్టి హీరోయిన్‌లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఒకరు జై చిరంజీవ సినిమాలో నటించిన శ్రియ శర్మ ఒకరు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భుమిక, సమీరారెడ్డి హీరోయిన్స్ గా నటించారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం పెద్దగా సక్సెస్‌ కాలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా కథను మలుపు తిప్పే మాత్రం చిరంజీవి మేనకోడలిదే అని తెలిసిందే. సినిమాలో ఈ చిన్నారి పాత్ర చనిపోయిన తర్వాతే కథ మలుపు తిరుగుతుంది.

ఆ పాత్రలో నటించిన శ్రియ శర్మ ఎంతగానో ఆకట్టుకుంది. తన క్యూట్‌ నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇప్పుడీ చిన్నారి హీరోయిన్‌గా మారింది. శ్రీకాంత్ తనయుడు నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో తొలిసారి హీరోయిన్‌ పాత్రను పోషించింది. అయితే ఈ సినిమా తర్వాత శ్రియ శర్మ వరుసగా సినిమాల్లో నటిస్తుందని అంతా భావించారు. కానీ దీనికి విరుద్దంగా ఈ బ్యూటీ సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. అయితే ప్రస్తుతం శ్రియశర్మ పూర్తిగా మేకవర్‌ అయింది. పక్కా హీరోయిన్‌గా మెటీరియల్‌గా మారిపోయింది.

దీంతో చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అప్పుడో ఇంతలా మారిపోయిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక సినిమాల్లో నటించకపోయినా సోషల్‌ మీడియా వేదికగా మాత్రం నిత్యం టచ్‌లో ఉంటుందీ చిన్నది. ముఖ్యంగా తన లేటెస్ట్‌ గ్లామర్‌ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. హిమాచల్ ప్రదేశ్ లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని తండ్రి ఇంజనీర్ కాగా.. ఆమె తల్లి డైటీషియన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డు అందుకున్న శ్రియా శర్మ.. ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. సినిమాల కంటే ఆమె లాయర్ వృత్తిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories