Jagapathi Babu: ఇకపై నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తానంటున్న జగపతి బాబు

Jagapathi Babu Says, I will do Only the Characters which he Likes in Movies
x

జగపతి బాబు (ఫైల్ ఫోటో)

Highlights

Jagapathi Babu: హీరో గా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు 2014లో విలన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన...

Jagapathi Babu: హీరో గా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు 2014లో విలన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన "లెజెండ్" సినిమాతో విలన్ గా మారిన జగపతి బాబుకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకవైపు విలన్ పాత్రలు మరొకవైపు తండ్రి పాత్రలతో బిజీ అయిపోయారు జగపతి బాబు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోయపాటి మరియు బాలకృష్ణ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు జగపతిబాబు.

"లెజెండ్" సినిమాలో కూడా ఫైట్స్ లో నాకు అన్యాయం జరిగింది. కానీ ఇప్పుడు నేను అవన్నీ దాటేశాను. ఇప్పుడు నేను నా టర్మ్స్ లో సినిమాలు చేస్తాను. నాకు నచ్చితేనే సినిమా చేస్తాను. నాకు లెజెండ్ లో చెప్పినది ఒకటి, సినిమాలో చేసింది ఇంకొకటి. లయన్ మరియు టైగర్ మధ్య ఫైటింగ్ లా ఉంటుందని చెప్పారు కానీ నన్ను ఆఖరికి కుందేలును చేశారు. ప్రతిసారి ఆయన క్యారెక్టర్ రావడం, నేను అరవడం రెండు కొట్టించుకోవడం అంతే. అది సినిమానా? అందుకే ఇప్పటి నుంచి నాకు నచ్చిన పాత్రలు మాత్రమే చేద్దామని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చారు జగపతిబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories