Jabardasth: సుడిగాలి సుధీర్ అందులో వీక్ అంట!

Jabardasth: సుడిగాలి సుధీర్ అందులో వీక్ అంట!
x
Highlights

జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్‌పై 'త్రీ మంకీస్' చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు.

జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్‌పై 'త్రీ మంకీస్' చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ జి. నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ ను ఆవిష్కరించారు.

ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుస్తామో తెలియదు.. ఆ పైవాడికి తప్ప. మనం ఎంచుకున్న బాట.. ఆ విధి ఆడించే ఆట అన్న వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలవుతుంది. రెండు నిమిషాలు ఉన్న చిత్ర ట్రైలర్ ఫన్ , రొమాంటిక్ అండ్ ఎమోషన్ గా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇందులో శకలక శంకర్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇక చిత్ర ట్రైలర్ లో సుడిగాలి సుధీర్ అందులో వీక్ అంటూ షకలక శంకర్ ఏదో కొత్త వ్యాధి చెబుతున్నాడు అదే ఏంటో ట్రైలర్ చూసి తెలుసుకోండి!

చిత్ర ట్రైలర్ విడుదల చేసిన అనంతరం హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ - " కోతి వేశాలలో కూడా అంతర్లీనంగా గొప్ప సందేశం ఉంటుంది. కోతులు కొన్ని సార్లు వాటికి తెలియకుండానే మంచి పనులు చేస్తుంటాయి.దాన్ని ఆధారం చేసుకొని దర్శకుడు ఈ సినిమా తీశాడు అనిపిస్తుంది. ఒక కమెడియన్ అనేవాడు తన గురించి ఆలోచించకుండా ఎదుటివారిని నవ్విస్తాడు. వారి కష్టాన్ని బేరీజు వేయలేము. జబర్దస్ కామెడీ షో ద్వారా కొన్ని కోట్ల మందిని నవ్వించే కమెడియన్స్ అందరూ కలిసి చేస్తున్న చిత్రం 2020 లో పెద్ద హిట్టు అయ్యి టీమ్ అందరికి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

ఇక తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'సాఫ్ట్‌‌వేర్ సుధీర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories