Chiranjeevi: మెగాస్టార్ తో స్టెప్పులేయబోతున్న జబర్దస్త్ బ్యూటీ

Jabardasth Rashmi Going to be do a Item Song in Bhola Shankar Movie
x

చిరంజీవి తో కలసి స్టెప్పులేయనున్న జబర్దస్త్ బ్యూటీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో ఐటమ్ సాంగ్ కొట్టేసిన రష్మి గౌతమ్

Chiranjeevi: జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. కానీ ఏ సినిమాతోనూ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భామకి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దొరికిందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో అజిత్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "వేదాలం" సినిమాని ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి "భోళా శంకర్" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో రష్మీ మెగాస్టార్ తో కలిసి స్టెప్పులు వేయబోతోందట. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేస్తున్నారు. మాస్ నంబర్ గా విడుదల కాబోతున్న ఈ పాట లో డాన్స్ చేసే అవకాశం నిజంగానే రష్మి కి దొరికిందా లేదా అనేదానిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది కోల్కతాలో ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్రలో కనిపించనున్నారు. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories