రోజాను 'అమ్మమ్మ'ని చేసిన హైపర్ ఆది !

రోజాను అమ్మమ్మని చేసిన హైపర్ ఆది !
x
Roja and Hyper Aadi
Highlights

సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు భోగి మంటలు, హారిదాసు కీర్తనలు, కొత్త అల్లుళ్లు, కోడిపందాలు, వీటికి తోడు సినిమాలు, ఇన్నేళ్లు సినిమా అభిమానులు,...

సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు భోగి మంటలు, హారిదాసు కీర్తనలు, కొత్త అల్లుళ్లు, కోడిపందాలు, వీటికి తోడు సినిమాలు, ఇన్నేళ్లు సినిమా అభిమానులు, ఇప్పుడు తరం మారింది. వినోద కార్యక్రమాలు రూపు మారింది. టీవి చానళ్లలో వినోదాల విందులాంటి కామెడీ స్కిట్ల పోరు అందరిని నవ్వుల సందడిలో ముంచెస్తోంది. ఈ ఒరవడిలో ఈటీవీలో ప్రసారమైన "అమ్మనాన్న ఓ సంక్రాంతి" కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.జబర్ధస్త్ కామెడీ టీమ్ రకరకాల స్కిట్లతో సందడి చేశారు. అందులో భాగంగా ఆది స్కిట్ రోజా అత్తగారిగా హైపర్ ఆది , సుడిగాలి సుధీర్ అలుళ్లగా చేశారు.


ఈ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది తన పంచులతో రోజాను ఓ ఆట ఆడుకున్నారు. అల్లుళ్లుకు హారతి ఇవ్వడానికి వచ్చిన రోజాని ఫైర్ బ్రాండ్ తో ఫైర్ చూసి భయమేస్తుందన్న ఆది మిమ్మల్నీ అమ్మమ్మమ్మ..!అంటూ ఆది పంచ్ వేశాడు. దాంతో రోజా ఆదిపై జాగ్రత్తా అంటూ హెచ్చరించారు.

ఈ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది తన పంచులతో రోజాను ఓ ఆట ఆడుకున్నారు. అల్లుళ్లుకు హారతి ఇవ్వడానికి వచ్చిన రోజాని ఫైర్ బ్రాండ్ తో ఫైర్ చూసి భయమేస్తుందన్న ఆది మిమ్మల్నీ అమ్మమ్మమ్మ..!అంటూ ఆది పంచ్ వేశాడు. దాంతో రోజా ఆదిపై జాగ్రత్తా అంటూ హెచ్చరించారు.

అసలు ఇంతకి ఈ స్కిట్ లో ఏమైంది అంటే రోజా కూతుళ్లును ఆది, సుధీర్ పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి సందర్భంగా రోజాకు ఆదికి మధ్య డైలాగ్స్ బుల్లితెర ప్రేక్షకులకు మంచి జోష్‌నిచ్చింది. స్కిట్ ప్రకారం ఆదికి సుధీర్‌కు లెక్కలేని అంత మంది కవల పిల్లలు పుడతారు. ఈ స్కిట్ లో నిజమైన కవలలను తీసుకొచ్చి నటిపిజేశారు. ఆ కవలతో రోజాను అమ్మమ్మను చేశామంటూ.. సుధీర్ అంటాడు దానికి రోజా కోప్పడగా.. ఆది మిమ్మల్ని అమ్మమ్మ అంటామా అమ్మమ్మ అని మళ్లి కౌంటర్ వేశారు. దీంతో రోజా ఫక్కున నవ్వుతారు. మొత్తం మీద స్పేషల్ కార్యక్రమంలో ఆది చేసిన హంగామా అందరిని ఆకట్టుకుంది. హైపర్ ఆది రోజాపై పేల్చిన పంచ్‌ల్లో కొన్ని..

రోజా : అల్లుళ్లుకు ఇంకా కోపం తగ్గినట్లు లేదు..

హైపర్ ఆది : అత్తగారికి అందం తగ్గినట్లు లేదు

రోజా : మా అమ్మయిలు హీరోయిన్ కావాల్సిన వాళ్లు.. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు అడిగారు.

రోజాకూతురు : అఖిల్ అక్కినేని పక్కన మమ్మల్ని ఆడిగారు

సుడిగాలి సుధీర్ : దేనికీ,

ఆది : అఖిల్ క్రికెట్ ఆడుతుంటే పక్కన చీర్‌గార్ల్ గా చేయడానికి

రోజా కూతురు : ఇలా అంటే నేను బుంగమూతి పెడతాను

ఆది : ఉన్నమూతి చేడలేకపోతున్నాం ఇంకా బుంగమూతి



రోజా : ఎంట్రా ఎక్కువ చేస్తున్నారు

సుధీర్ : ఆదితో అత్తగారు ఎంటి సడన్ గా రా అంటున్నారు

ఆది : అత్తగారి అసెంబ్లీ అవతారం

కూతురు : మా అమ్మ పాలు తీసురాకపోతే తిట్టుది. కురగాయలు తీసుకురాకపోతే తిట్టుది

సుధీర్ : ఎంతసేపున్నా తీసుకురాకపోతే

ఆది : ప్రెస్ మీట్ పెట్టుది

రోజా కూతురు -ఆది : మీ కోసం ఇన్నిరోజులుగా కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నాం

హైపర్ఆది : ఆ ఒత్తులకు నిప్పుపెట్టుకోవాల్సింది.

ఇలా హైపర్ ఆది సుడిగాలి సుధీర్ ఇద్దరు కలిసిన చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. సంక్రాంతి సందర్బంగా ఈటీవీలో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆటక్టుకుంది. హైపర్ ఆది తన పంచ్ డైలాగ్స్ లో మరోసారి సత్తాచాటారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories