Top
logo

హృదయాలను హత్తుకునేలా 'జాను' ట్రైలర్

హృదయాలను హత్తుకునేలా జాను ట్రైలర్
X
Jaanu Movie
Highlights

ఎగిసిపడే కెరటాల్లో .. ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను.. అంటూ శర్వానంద్ చెప్పే పొయిట్రీతో ట్రైలర్ మొదలవుతుంది.

తమిళంలో విడుదలై సూపర్ హిట్ సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో జాను గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్‌ , సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. తమిళంలోని ఈ సినిమాలో విజయ్ సేతుపతి త్రిష జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ తెలుగు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా జానుకు సంబంధిన టైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. మొదట ఈ చిత్రం టైలర్‌లో హీరో శర్వానంద్ చేప్తే కవిత్వం అద్భుతంగా ఉంది. ఎగిసిపడే కెరటాల్లో .. ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను.. అంటూ శర్వానంద్ చెప్పే పొయిట్రీతో ట్రైలర్ మొదలవుతుంది. నువ్ వర్జినేనా అని సమంత శర్వానంద్ ను ఆడడం ఏం మాట్లాడుతున్నావ్ జాను అంటు హీరో సిగ్గుపడుతూ.. చెప్పే డైలాగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మనసును హత్తుకునే విధంగా, చాలా అందంగా ట్రైలర్‌ నడిచింది. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేసేందుకు చిత్ర బృదం సన్నాహాలు చేస్తుంది. గోవింద్‌ వసంత్‌ సంగీత సమకుర్చారు.


Web TitleJaanu Movie trailer is out
Next Story