'జాను' సినిమా రివ్యూ

జాను సినిమా రివ్యూ
x
Highlights

టాలీవుడ్ లో శర్వానంద్ ప్రస్థానం ప్రత్యేకమైనదనే చెప్పొచ్చు. తన సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు శర్వానంద్.

టాలీవుడ్ లో శర్వానంద్ ప్రస్థానం ప్రత్యేకమైనదనే చెప్పొచ్చు. తన సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు శర్వానంద్. ఇప్పుడు శర్వానంద్ హీరోగా,.సమంత హీరోయినగా తమిళంలో సూపర్ హిట్ అయిన '96' ను తెలుగులో జాను పేరుతో తెరకెక్కించారు. తమిళ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజు గురువారం విడుదల అయింది. తమిళంలో క్లాసిక్ మూవీగా హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయదాంతో రెండిటి మధ్య పోలిక రావడం సహజం. త్రిష అక్కడ కథానాయిక. ఇక్కడ ఆపాత్ర సమంత చేశారు. దీంతో ఇద్దరిలో ఎవరు బాగా చేశారని పోలుస్తూ సినిమా చూస్తారు ప్రేక్షకులు. విజయ్ సేతుపతి తమిళ వెర్షన్ లో అడరగోట్టీశారు. మరి ఆ రేంజిలో శర్వానంద్ నటన ఉందా అని చూడడమూ జరుగుతుంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం?

కథ

ఈ సినిమాలో సి.రామచంద్రన్‌(శర్వానంద్‌) ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌. ఓ జర్నీలో తను పుట్టి పెరిగిన గ్రామానికి చేరుకుంటాడు. ఆ గ్రామంలోతన చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు తను స్కూల్‌ దగ్గరకు రామచంద్రన్ వెళతాడు. ఆ సమయంలోనే ప్రేమ జ్ఞాపకాలు అతడి కళ్లముందు కదలుతాయి. జానకీ దేవీ(సమంత)తో ప్రేమలో కలిసి తిరిగిన మధుర క్షణాలు.. ఇద్దరూ విడిపోవటం అన్నీ గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత 17 ఏళ్ల తర్వాత మిత్రులు ఏర్పాటు చేసిన గెట్‌ టు గెదర్‌ పార్టీలో చోటుచేసుకునే పరిణామాలతో ఇద్దరూ కలుస్తారు. జానకీ దేవీ, రామచంద్రన్ ఎందుకు విడిపోయారు? చాలా కాలం తర్వాత కలుసుకున్న ఓ ప్రేమ జంట మదిలో మెదిలే భావాలేంటి అన్నదే ఈ కథ.

సాంకేతికంగా

జాను సినిమాను ఓ రీమేక్‌లా అనిపించుకుండా తెలుగు నేటివిటీతో దర్శకుడు సి. ప్రేమ్‌ కుమార్ తెరకెక్కించారడు. 96 సినిమా తెలుగు తెరపై కొనసాగిందని చెప్పొచ్చు.. కథకి భాషతో సంబంధం లేదని రుజువు చేశాడు. లవ్ ఎమోషన్స్‌ ఎక్కడా తక్కువ కాలేదు. ఈ సినిమా ప్రేమతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరి జీవితానికి కనెక్ట్‌ అవుతుంది. కొన్ని సన్నివేశాల్లో మనల్ని మనం తెరపైన చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ మనస్సుకు హత్తుకునేలా ఉంటాయి. గోవింద వసంత బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అద్భుతంగా పనిచేసింది. పాటలు కొద్దిగా దృష్టి సారించినట్లు ఉంటే ఇంకా బాగుంటుంది. మొదటి అర్థభాగం కొన్ని కామెడీ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. ద్వితీయ భాగం భగ్న ప్రేమికుల మధ్య బాధ గుండెల్నీ పిండెస్తుంది. సినిమాలో ఎక్కడా అశ్లీలతకు తావులేని ఓ అందమైన ప్రేమ కథా చిత్రమ్ 'జాను' అని చెప్పొచ్చు.

సమంత తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. భగ్న ప్రేమికుడిగా శర్వానంద్‌ నటన గురించి ప్రేత్యేకంగా చప్పనక్కర్లేదు. వెన్నెల కిషోర్‌, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, శరణ్య తమ పరిధిమేరకు బాగా నటించారు. మొత్తానికి సినిమాలో సమంత, శర్వానంద్ నటన అద్బుతంగా ఉంటుంది. గోవింద వసంత బ్యాక్ గ్రౌండ్ అద్భుతంగా.. ఇలాంటి సినిమాల్లో సాంగ్స్ చాలా ముఖ్యం అయితే గోవింద వసంత పాటలు మాత్రం నిరాశపరిచాయి. జాను సినిమా 96 ఒరిజినల్‌లోని రీ క్రియేట్ చెయ్యడంలో చాలా వరకు సఫలమైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories