గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఇస్మార్ట్ శంకర్

ఈ మధ్యనే 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం తన ఆశలన్నీ...
ఈ మధ్యనే 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం తన ఆశలన్నీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభ నటేష్, 'మిస్టర్ మజ్ను' ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. అక్కడ కొన్ని అందమైన ప్రదేశాలలో చిత్రబృందం కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించింది. తాజా సమాచారం ప్రకారం గోవాలోని ఈ కీలకమైన షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది.
ఇద్దరు హీరోయిన్లు కూడా గోవా షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి అయినట్లే. ఈ సందర్భంగా చిత్ర బృందం పార్టీ కూడా చేసుకున్నారు. ఈ సినిమాలో రామ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఆ విషయం చిత్ర పోస్టర్స్ ను చూస్తేనే అర్థమైపోతోంది. పూరి జగన్నాథ్ మరియు చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమాను మేలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT