టాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటించడం వెనుక మర్మం ఇదేనా?

Is this the Reason Behind the Tollywood Heros Announced Donations to AP Government for Flood Victims
x

టాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటించడం వెనుక మర్మం ఇదేనా?

Highlights

Tollywood Heroes Donations - AP Flood Victims: టాలీవుడ్ హీరోల సాయానికి కారణం ఇదేనా?

Tollywood Heroes Donations - AP Flood Victims: గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ వరదలతో అల్లకల్లోలంగా మారిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు నీళ్లలో మునిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు వరదలు ముంచెత్తున్నాయి. దశాబ్దాల వ్యవధిలో ఎన్నడూ జరగనంత నష్టం ఇప్పుడు వాటిల్లింది. ప్రజలు అల్లాడిపోతుంటే టాలీవుడ్ నుంచి కనీస స్పందన కూడా లేదని వైకాపా నేతలు కన్నేర్రచేసి విమర్శలు గుప్పించారు. కానీ బుధవారం నాడు ఉన్నట్లుండి వరుసబెట్టి టాలీవుడ్ హీరోలు ఒక్కళ్ళ తర్వాత మరొకళ్ళు వరద బాధితుల కోసం విరాళాలు ప్రకటించడం మొదలుపెట్టారు.

మొట్టమొదటగా జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలు విరాళమిచ్చారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ ఇలా ఒకళ్ళ తర్వాత మరొకరు విరాళాలు ప్రకటించేశారు. కానీ కొంత సమయం వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ఇలా విరాళాలు ప్రకటించడం చూస్తే ఇది ముందే అనుకుని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నట్టు గా ఉంది. ఏపీలో టికెట్ల రేట్లను నిర్దేశిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిన కాసేపటికే హీరోలు ఇలా విరాళాలు ప్రకటించడం గమనార్హం. వరద బాధితులకు సాయం ప్రకటించి టికెట్ రేట్లు విషయంలో జగన్ మనసు మార్చడానికి వారు ఈ ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories