అందుకే రష్మిక మందన్న టాలీవుడ్ మీడియాకి దూరంగా ఉంటుందా?

Is that Why Rashmika Mandanna Stays Away from Tollywood Media?
x

అందుకే రష్మిక మందన్న టాలీవుడ్ మీడియాకి దూరంగా ఉంటుందా?

Highlights

Rashmika Mandanna: కావాలనే తెలుగు మీడియాని రష్మిక ఎవాయిడ్ చేస్తుందా?

Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఈమధ్యనే "వారసుడు" సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో విజయ్ సినిమా ప్రమోషన్స్ కి రాలేదు. కనీసం రష్మిక మందన్న ఆయన సినిమాని ప్రమోట్ చేస్తుంది అనుకుంటే అది కూడా జరగలేదు. అయితే ఈ నేపథ్యంలో రష్మిక మందన్న కావాలని తెలుగు మీడియాకి దూరంగా ఉంటుందా అని అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అయితే మరోవైపు రష్మిక మందన్న ఇటు తమిళ్ మరియు అటు హిందీ సినిమాలతో బాగా బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.

సిద్ధార్థ మల్హోత్రా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన మిషన్ మజ్ను సినిమా కూడా ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమా కోసం రష్మిక బాగానే ప్రమోషన్లలో పాల్గొంది. సిద్ధార్థ మల్హోత్రల గురించి సినిమా గురించి రష్మిక బోలెడు విషయాలు కూడా చెప్పుకొచ్చింది. కానీ రష్మిక మాత్రం ఈ మధ్య తెలుగు మీడియా కి చిక్కటం లేదు. మరో వైపు రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది.

టాలీవుడ్ ఎక్కడ దీని గురించి ప్రశ్నలు అడుగుతుందో అన్న భయంతోనే రష్మిక కావాలని తెలుగు మీడియాకి దూరంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. తన ప్రేమ విషయమై రష్మిక మందన్న ఎలాంటి పుకార్లకు రియాక్ట్ అవ్వాలని అనుకోవటం లేదని అందుకే కావాలని తెలుగు రాష్ట్రాల మీడియాకి దూరంగా ఉంటుందని ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories