Samantha: అందుకే సమంత తిరుమల వెళ్లిందా?

Samantha: అందుకే సమంత తిరుమల వెళ్లిందా?
x

సమంత మరియు నాగ చైతన్య (ఫైల్ ఇమేజ్)

Highlights

Samatha: సమంత నాగచైతన్య మధ్య అంతా బాగానే ఉందా?

Samantha: స్టార్ బ్యూటీ సమంత అక్కినేని ఇంస్టాగ్రామ్ లో తన పేరు లో నుండి అక్కినేని తీసేసి తన స్నేహితులతో ఒక్కతే వెకేషన్ కి వెళ్ళినప్పటి నుంచి సమంత మరియు నాగచైతన్య విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. సమంత లేక అక్కినేని కుటుంబం కానీ ఈ పుకార్లపై రియాక్ట్ అవ్వక పోవడం తో అవి మరింత జోరందుకున్నాయి. కొందరైతే సమంత నాగచైతన్య త్వరలోనే తమ విడాకులను ప్రకటించనున్నారు అంటూ కామెంట్లు చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ జంట మౌనం వహించటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ఈ మధ్యనే సమంత తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకొని వస్తుండగా ఒక రిపోర్టర్ ఈ పుకార్ల గురించి అడగగా ఆమె గుడి కి వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బుద్ధి లేదా అంటూ అతనిపై ఫైర్ అయ్యింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఆమెకి తన లేక నాగ చైతన్య సినిమా విడుదలకి ముందు తిరుపతి వెళ్లే అలవాటు ఉంది. నాగచైతన్య "లవ్ స్టోరీ" త్వరలోనే విడుదల కాబోతోందని సమంత తిరుమల వెళ్లిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదే కనుక నిజమైతే సమంత మరియు నాగచైతన్య విడిపోవటం లేదని, వారిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని తెలుస్తోంది. ఇక "లవ్ స్టోరీ" ట్రైలర్ ను సమంత ట్విట్టర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దానికి నాగచైతన్య కూడా రిప్లై ఇచ్చారు. దీంతో అక్కినేని అభిమానులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories