Simbu: శింబుతో మురుగదాస్ కొత్త చిత్రం?

Simbu
x

Simbu: శింబుతో మురుగదాస్ కొత్త చిత్రం?

Highlights

Simbu: దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో శింబు జతకట్టనున్నారు.

Simbu: ప్రముఖ తమిళ నటుడు శింబు కెరీర్‌లో మరో కీలక ప్రాజెక్టు సిద్ధమవుతోంది. గజినీ, తుపాకీ వంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో శింబు జతకట్టనున్నారు.


ఈ చిత్రం వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో ఫ్లోర్‌కు వెళ్లనుంది. ప్రస్తుతం శింబు దర్శకుడు వేట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఎస్టీఆర్51 అనే ప్రాజెక్టును ప్రారంభిస్తారట. దీన్ని డ్రాగన్ దర్శకుడు అశ్విన్ రూపొందిస్తున్నారు.


ఈ చిత్రం పూర్తయిన అనంతరం మురుగదాస్ చిత్రం మొదలవుతుంది. ఈ మూడు ప్రాజెక్టులతో శింబు కెరీర్ మరింత బూస్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మురుగదాస్-ఎస్టీఆర్ కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories