logo

మహర్షి హిట్టో కాదో ముందే తేల్చేస్తోన్న ఆ ఇద్దరు

మహర్షి  హిట్టో కాదో ముందే తేల్చేస్తోన్న ఆ ఇద్దరు
Highlights

మహేశ్ బాబు, పూజా హెగ్డే కాంబినేషన్ లో వంశీ పైడి పల్లి తీసిన మూవీ తో దిల్ రాజు ఫేట్ మారబోతోందా? మొన్నే ఎఫ్ 2...

మహేశ్ బాబు, పూజా హెగ్డే కాంబినేషన్ లో వంశీ పైడి పల్లి తీసిన మూవీ తో దిల్ రాజు ఫేట్ మారబోతోందా? మొన్నే ఎఫ్ 2 సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న దిల్ రాజు ఇప్పుడు పీవీపీ, అశ్వినీదత్ తో కంబైండ్ గా నిర్మించిన మహర్షి హిట్టో ఫట్టో తేల్చేస్తున్నారు ఇద్దరు నటులు వాళ్లే జయసుధ, ప్రకాశ్ రాజ్.

దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే హీరోకో లేదంటే హీరోయిన్ కో తల్లిదండ్రులుగా జయసుధ, ప్రకాశ్ రాజ్ కనిపించాల్సిందే ఆల్ మోస్ట్ బొమ్మరిళ్లు నుంచి ఇప్పుడొస్తున్న మహర్షి వరకు అన్నీంట్లో వీళ్లది లక్కీ జోడీ వీళ్లు వైఫ్ అండ్ హస్బెండ్ గా కనిపిస్తే ఆ మూవీ హిట్. శ్రీనివాస కళ్యాణం మూవీలో జయసుధ, ప్రకాశ్ రాజ్ ఉన్నా కాని, వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ వేయలేదు అందుకే ఆ మూవీకి కలిసి రాలేదన్నారు అదే జోడీ శతమానం భవతి మూవీ చేస్తే హిట్టొచ్చిందన్నారు. అదేనా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కూడా హీరోల తల్లిదండ్రులుగా మెరిసి ఆమూవీని కూడా సెంటిమెంటల్ గా హిట్ చేసిందీ జయసుధ, ప్రకాశ్ రాజ్ కాంబినేషనే అన్నారు

దిల్ రాజు బ్యానర్ లో ఓ మూవీ వస్తోందంటే అందులో, జయసుథ, ప్రకాశ్ రాజ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండాల్సిందే అది హిట్ సెంటిమెంట్ . ఐతే బొమ్మరిల్లు నుంచే ఈ సెంటిమెంట్ మొదలైంది బొమ్మరిల్లు, హిట్ తర్వాత కొత్త బంగారులోకం లో కూడా జయసుధ, ప్రకాశ్ రాజ్ జోడీ కట్టారు అంతే అదీ హిట్. ప్రకాశ్ రాజ్, జయసుద ఇద్దిరూ వైఫ్ అండ్ హస్పెండ్ రోల్స్ వేస్తే, దిల్ రాజు బ్యానర్ లో హిట్ పడినట్టే అలానే వీళ్లు ఆ పాత్రలు కాకుండే మరే పాత్ర వేసినా అదే దిల్ రాజు బ్యానర్ కి ఫ్లాప్ పడినట్టేనా? అదో సెంటిమెంట్ కూడా తయారైంది శ్రీనివాస కళ్యాణం, పరుగు రెండీంట్లో జయసుద, ప్రకాశ్ రాజ్ వేరు వేరు పాత్రలు వేశారు అంతే ఆ రెండు సినిమాలు అందుకే పోయాయన్నారు ఇప్పడు మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో మహేశ్ బాబు పేరెంట్స్ గా కనిపిస్తున్నారు కాబట్టి సెంటిమెంటల్ గా ఇది హిట్ అనేస్తున్నారు.లైవ్ టీవి


Share it
Top