Top
logo

కార్తీకదీపం చివరికి వచ్చేసిందా? నిజమేనా?

కార్తీకదీపం చివరికి వచ్చేసిందా? నిజమేనా?
X
Highlights

తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి ఇంటా పగలూ రాత్రీ తేడాలేకుండా ఆ దీపం వెలుగుతూనే ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి ఇంటా పగలూ రాత్రీ తేడాలేకుండా ఆ దీపం వెలుగుతూనే ఉంది. కొన్నేళ్లుగా. ఒక మామూలు వంటలక్క కి.. సున్నితమైన డాక్టర్ బాబుకి మధ్యలో వచ్చిన మనస్పర్థలు.. విడిపోయిన ఆ జంటను కలపాలని చూస్తున్న చిన్నారులు.. పెద్దరికంతో కోడల్ని సానుభూతితో అర్థం చేసుకున్న అత్తగారు.. ఎలాగైనా వంటలక్కకి డాక్టర్ బాబుతో విడాకులు ఇప్పించి పెళ్లాడాలనుకుంటున్న మరదలు పిల్ల ఎత్తులు.. ఇంతే! ఈ పాయింట్ల చుట్టూ గిరా గిరా తిరిగేస్తూ మహిళా ప్రేక్షకులనే కాదు.. ఎప్పుడూ టీవీ సీరియళ్లు చూడని మగ మహారాజుల్ని కూడా తన చుట్టూ తిప్పేసుకుంటోంది కార్తీకదీపం సీరియల్!

కొన్ని వారాలుగా ఈ సీరియల్ చివరికి వచ్చేసిందనీ, త్వరలో ఆగిపోబోతోందనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వంటలక్క అభిమానులు బెంగ పెట్టేసుకున్నారు. అయ్యో..అప్పుడే ఈ సీరియల్ ఆగిపోతుందా అని ఒకటే చర్చించేస్తున్నారు. నిజానికి ఈ సీరియల్ ఇప్పటికే రెండు మూడు సార్లు గుమ్మడికాయ కొట్టేసుకోవయాల్సింది. కానీ, సీరియల్ కదా పొడిగిస్తూ వస్తున్నారు. ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఇక తరువాతి వారంలో దీనిని ముగించేస్తారేమో అన్నంత ఉత్కంఠను రేకెత్తిస్తూ సా..గిపోతోంది.


ఈమధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ చానెళ్ళలోనూ, వెబ్ సైట్ లలోనూ కార్తీకదీపం ఇక ఆగిపోతుంది.. అంటూ పిచ్చ..పిచ్చగా వార్తలు వస్తున్నాయి. ఇవి చూసిన కార్తీక దీపం ప్రేమికులు ఆందోళన పడుతున్నారు. కానీ, జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్న సీరియల్ ను ఎలా ఆపేస్తారు. పైగా ఈ కథలో ఎన్ని ట్విస్ట్ లు కావాలంటే అన్ని ట్విస్ట్ లు ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. రోజుకొక అరగంట.. అందులో యాడ్స్ పోనూ కనిపించే సీరియల్ కథ కేవలం పదిహేను నిమిషాలు మించదు. మరి అటువంటప్పుడు కార్తీకదీపం ఆరిపోతుందని అనుకొనవసరం లేదు.

ఈ సీరియల్ మలయాళంలో మొదట ప్రసారం ప్రారంభం అయింది. ఇప్పటికీ 1650 ఎపిసోడ్లు దాటిపోయి ఇంకా నడుస్తూనే ఉంది. ఇక తెలుగులో కేవలం 650 ఎపిసోడ్లవరకూ అయింది. కనుక ఇంకా చాలా కాలంపాటు ఈ సీరియల్ నడుస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈ సీరియల్ లో వంటలక్క దీప గా నటించిన కన్నడ నటి ప్రేమీ విశ్వనాధ్ ఇప్పుడు బుల్లితెర టాప్ హీరోయిన్. డీగ్లామర్ పాత్రలో.. నటిస్తూ చాలామంది హీరోయిన్లకంటే మంచి పేరు కొట్టేసింది. టీవీ సీరియల్స్ చూసే ప్రతి ఇంటిలోనూ ప్రేమీకి అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. టీవీ ప్రసారాల్లో వరుసగా టాప్ రాంకింగ్ ఈ దీపానిదే! ఈ వారం తాజా రేటింగ్ లలో కూడా 18 కి పైగా టీఆర్ఫీ పాయింట్లు సాధించింది ఈ సీరియల్. పండగల ప్రత్యేక ఎపిసోడ్ లు ఏవీ కూడా దీని దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇంత టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ ఆపేసి సాహసం మాటీవీ ఎలా చేస్తుంది చెప్పండి?


మొత్తమ్మీద కార్తీక దీపం సీరియల్ సినిమాల కంటే సూపర్ హిట్ బాటలో నడుస్తోంది. ఇంకో రెండు మూడేళ్లు ఈ దీపాన్ని ఆర్పడం కాదుకదా.. కనీసం వత్తి తగ్గించే సాహసం కూడా ఎవరూ చేయలేరు.

Web TitleIs Karthikadeepam serial becomes to climax
Next Story