Jr NTR : వార్ 2 తర్వాత బాలీవుడ్ బాటలోనే యంగ్ టైగర్.. షారుఖ్‌తో ఎన్టీఆర్ మల్టీస్టారర్?

Jr NTR : వార్ 2 తర్వాత బాలీవుడ్ బాటలోనే యంగ్ టైగర్.. షారుఖ్‌తో ఎన్టీఆర్ మల్టీస్టారర్?
x
Highlights

Jr NTR : RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులకు వార్ 2 సినిమా ద్వారా మళ్లీ పలకరించారు.

Jr NTR: RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులకు వార్ 2 సినిమా ద్వారా మళ్లీ పలకరించారు. అయితే, ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ ఎన్టీఆర్‌కు బాలీవుడ్‌లో కూడా అభిమానులు భారీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మరొక బాలీవుడ్ అగ్ర నటుడితో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారని తాజాగా కొన్ని నివేదికలు వినిపిస్తున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అని వదంతులు బలంగా వ్యాపిస్తున్నాయి.

వార్ 2 చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్ స్పై సినిమా పఠాన్ ను కూడా నిర్మించింది ఇదే సంస్థ. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా స్పై థ్రిల్లర్ సినిమాలను వరుసగా నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే ఒక సినిమా కథను మరొక సినిమాకు లింక్ చేస్తూ వస్తున్నారు. పఠాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ టైగర్ పాత్రలో అతిథి పాత్రలో మెరిసినట్టుగానే, ఇప్పుడు పఠాన్ సినిమా సీక్వెల్ అయిన పఠాన్ 2లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి.

మేజర్ రఘు విక్రమ్ పాత్రే కీలకం?

వార్ 2 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో ఆయన మేజర్ రఘు విక్రమ్ చలపతి అనే పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ పాత్ర విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఇదే పాత్ర పఠాన్ 2 చిత్రంలో కూడా కొనసాగుతుందని, ఈ స్పై యూనివర్స్‌లో భాగమవుతుందని అంటున్నారు. 2023లో విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసి భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా పఠాన్ 2 నిర్మించడానికి YRF సన్నాహాలు చేస్తోంది.

ఎన్టీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ

అయితే, జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఈ పఠాన్ 2 ప్రాజెక్ట్‌లో భాగమవుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వార్ 2 అనుకున్నంతగా విజయం సాధించకపోవడం వలన, ఎన్టీఆర్ బాలీవుడ్‌కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories